తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kohli Vs Ganguly: ముదిరిన కోహ్లి, గంగూలీ వివాదం.. దాదాను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిన విరాట్

Kohli vs Ganguly: ముదిరిన కోహ్లి, గంగూలీ వివాదం.. దాదాను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసిన విరాట్

Hari Prasad S HT Telugu

17 April 2023, 22:51 IST

    • Kohli vs Ganguly: కోహ్లి, గంగూలీ వివాదం ముదిరింది. దాదాను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేశాడు విరాట్. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గంగూలీ, విరాట్ (ఫైల్ ఫొటో)
గంగూలీ, విరాట్ (ఫైల్ ఫొటో)

గంగూలీ, విరాట్ (ఫైల్ ఫొటో)

Kohli vs Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి, సౌరవ్ గంగూలీ మధ్య ఏం జరుగుతోంది? ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్న ప్రశ్న ఇది. ఈ మధ్య ఆర్సీబీ, డీసీ మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లితో హ్యాండ్ షేక్ చేయకుండా గంగూలీ వెళ్లిపోవడం.. ఇదే మ్యాచ్ లో మరో చోటు కోహ్లిని పట్టించుకోకుండా దాదా అలాగే ముందుకెళ్లడంతో ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో గంగూలీని విరాట్ అన్‌ఫాలో అయ్యాడన్న వార్త మరింత ఆసక్తి రేపుతోంది. ఈ ఇద్దరూ కావాలనే ఒకరి నుంచి మరొకరు దూరంగా వెళ్తున్నారని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఆర్సీబీ, డీసీ మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్ల ప్లేయర్స్ హ్యాండ్ షేక్స్ చేసుకుంటున్న సమయంలో కోహ్లితో పాంటింగ్ మాట్లాడుతూ కనిపించాడు.

ఈ సమయంలో ఆ వెనకే ఉన్న గంగూలీ.. కోహ్లితో హ్యాండ్ షేక్ చేయకుండానే ముందుకు వెళ్లిపోయాడు. ఇక ట్విటర్ లో వైరల్ అవుతున్న మరో వీడియోలో.. డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చున్న కోహ్లి ముందు నుంచే వెళ్తూ అతన్ని పట్టించుకోలేదు గంగూలీ. ఆ సమయంలో దాదాను విరాట్ చాలా సీరియస్ గా చూడటం వీడియోలో కనిపించింది.

ఈ రెండు వీడియోలతో ఈ ఇద్దరి మధ్యా ఏదో జరుగుతోందని అభిమానులు ఫిక్సయిపోయారు. ఇక ఇప్పుడు దాదాను ఇన్‌స్టాలో విరాట్ అన్‌ఫాలో చేశాడన్న వార్త వీళ్ల మధ్య విభేదాలకు మరింత ఊతమిస్తోంది. అటు గంగూలీ కూడా విరాట్ ను అన్‌ఫాలో చేశాడు. నిజానికి ఈ ఇద్దరి విరోధం ఇప్పటిది కాదు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే విరాట్ తన కెప్టెన్సీ కోల్పోయాడు.

తదుపరి వ్యాసం