తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Retentions And Releases: విలియమ్సన్‌ను వదిలేసిన సన్‌రైజర్స్‌.. చెన్నై నుంచి బ్రావో ఔట్‌

IPL Retentions and Releases: విలియమ్సన్‌ను వదిలేసిన సన్‌రైజర్స్‌.. చెన్నై నుంచి బ్రావో ఔట్‌

Hari Prasad S HT Telugu

15 November 2022, 18:36 IST

    • IPL Retentions and Releases: విలియమ్సన్‌ను వదిలేసింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీమ్‌. అటు చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ డ్వేన్‌ బ్రావోను, పంజాబ్‌ కింగ్స్‌ మయాంక్‌ అగర్వాల్‌ను రిలీజ్‌ చేసింది.
కేన్ విలియమ్సన్
కేన్ విలియమ్సన్ (bcci twitter)

కేన్ విలియమ్సన్

IPL Retentions and Releases: ఐపీఎల్‌ టీమ్స్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, పంజాబ్‌ కింగ్స్‌ ఏకంగా తమ కెప్టెన్లనే రిలీజ్‌ చేశాయి. ఐపీఎల్‌ రిటెన్షన్‌, రిలీజ్ల కోసం మంగళవారమే (నవంబర్‌ 15) చివరి రోజు కావడంతో ఫ్రాంఛైజీలన్నీ అవే పనిలో ఉన్నాయి. సన్‌రైజర్స్‌ టీమ్‌ తమ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను రిలీజ్‌ చేసింది. 8 ఏళ్లుగా టీమ్‌తోనే ఉన్న విలయమ్సనే సన్‌రైజర్స్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

అతన్ని వదిలేయడంతో రానున్న వేలంలో సన్‌రైజర్స్‌కు మరింత భారీ మొత్తం ఖర్చు చేసే అవకాశం దక్కింది. సన్‌రైజర్స్‌ తరపున విలియమ్సన్‌ 2101 రన్స్‌ చేశాడు. మొత్తంగా 76 మ్యాచ్‌లు ఆడగా.. 46 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. కొన్ని సీజన్లుగా విలియమ్సన్‌ ఆశించి మేర రాణించడం లేదు. 2022 సీజన్‌లో అయితే సన్‌రైజర్స్‌ 8వ స్థానంలో నిలిచింది.

గత వేలానికి ముందు రూ.14 కోట్లు పెట్టి మరీ విలియమ్సన్‌ను రిటేన్‌ చేసుకుంది సన్‌రైజర్స్‌ టీమ్‌. అతనితోపాటు అబ్దుల్‌ సమద్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లను కూడా రిటేన్‌ చేసుకుంది. 2018లో విలియమ్సన్‌ కెప్టెన్సీలోనే సన్‌రైజర్స్‌ ఫైనల్‌ వరకూ వచ్చింది. ఆ సీజన్‌లో అతడే 52 సగటుతో 735 రన్స్ చేశాడు. కానీ 2022లో మాత్రం అతడు 13 మ్యాచ్‌లలో కేవలం 216 రన్స్‌ చేశాడు.

సన్‌రైజర్స్‌ టీమ్‌ విలియమ్సన్‌తోపాటు పూరన్‌, జగదీశ సుచిత్‌, ప్రియమ్‌ గార్గ్, రవికుమార్‌ సమర్థ్‌, రొమారియో షెపర్డ్‌, సౌరభ్‌ దూబె, సీన్‌ అబాట్, శశాంక్‌ సింగ్‌, శ్రేయస్‌ గోపాల్‌, సుశాంత్‌ మిశ్రా, విష్ణు వినోద్‌లను రిలీజ్ చేసింది.

మయాంక్‌ను రిలీజ్‌ చేసిన పంజాబ్‌

అటు పంజాబ్‌ కూడా 2022 సీజన్‌లో తమ కెప్టెన్‌గా ఉన్న మయాంక్‌ అగర్వాల్‌ను రిలీజ్‌ చేసింది. వచ్చే సీజన్‌కు కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌ను ఇప్పటికే ఆ టీమ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మయాంక్‌న వదిలేసింది. గతేడాది వరకూ కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా ఉండగా.. 2022 వేలానికి ముందు అతడు వెళ్లిపోయాడు.

దీంతో ఈ సీజన్‌లో మయాంక్‌కు కెప్టెన్సీ అప్పగించారు. అయితే అతని కెప్టెన్సీలో పంజాబ్‌ కింగ్స్ దారుణంగా విఫలమైంది. దీంతో ముందు కెప్టెన్సీ నుంచి అతన్ని తప్పించిన ఫ్రాంఛైజీ.. ఇప్పుడు టీమ్‌ నుంచే రిలీజ్‌ చేసింది. మరోవైపు జానీ బెయిర్‌స్టో, షారుక్‌ ఖాన్‌లను మాత్రం రిటేన్‌ చేసుకుంది.

చెన్నై నుంచి బ్రావో ఔట్‌

ఇక చెన్నై సూపర్‌ కింగ్స్ టీమ్‌ తమ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావోను రిలీజ్‌ చేసింది. అతనితోపాటు రాబిన్‌ ఉతప్ప, ఆడమ్‌ మిల్నె, హరి నిషాంత్‌, క్రిస్‌ జోర్డాన్‌, భగత్‌ వర్మ, కేఎం ఆసిఫ్‌, నారాయణ్‌ జగదీశన్‌లను కూడా వదిలేసింది. రవీంద్ర జడేజాను కూడా రిలీజ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చినా.. చెన్నై మాత్రం అతన్ని రిటేన్‌ చేసుకుంది.

కోల్‌కతా నుంచి ప్యాట్‌ కమిన్స్‌, శివమ్‌ మావి ఔట్‌

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీమ్‌ ఈ సీజన్‌కు అందుబాటులో ఉండబోమని ప్రకటించిన ప్యాట్‌ కమిన్స్‌తోపాటు సామ్‌ బిల్లింగ్స్‌ను రిలీజ్‌ చేసింది. ఈ ఇద్దరితోపాటు శివమ్ మావి, మహ్మద్‌ నబీ, చమిక కరుణరత్నె, ఆరోన్‌ ఫించ్‌, అలెక్స్‌ హేల్స్‌, అభిజీత్‌ తోమార్‌, అజింక్య రహానే, అశోక్ శర్మ, బాబా ఇంద్రజిత్‌, ప్రథమ్‌ సింగ్‌, రమేష్‌ కుమార్‌, షెల్డన్‌ జాక్సన్‌లను రిలీజ్‌ చేసింది.

టాపిక్

తదుపరి వ్యాసం