తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gavaskar To Team India: గెలవాలంటే ఇలా చేయండి.. గవాస్కర్ సలహా

Gavaskar to team india: గెలవాలంటే ఇలా చేయండి.. గవాస్కర్ సలహా

Hari Prasad S HT Telugu

07 March 2023, 23:17 IST

    • Gavaskar to team india: గెలవాలంటే ఇలా చేయండి అంటూ టీమిండియాకు కీలకమైన సలహా ఇచ్చాడు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. స్పిన్ పిచ్ లపై ఇండియన్ బ్యాటర్లు ఎలా ఆడాలో చెప్పాడు.
సునీల్ గవాస్కర్
సునీల్ గవాస్కర్ (twitter)

సునీల్ గవాస్కర్

Gavaskar to team india: ఆస్ట్రేలియాపై నాలుగో టెస్ట్ కు ముందు టీమిండియాకు ఓ సలహా ఇచ్చాడు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్. స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ లపై ఇండియా, ఆస్ట్రేలియా బ్యాటర్లు తడబడుతున్న వేళ సన్నీ కీలకమైన సూచన చేశాడు. స్పిన్ ను ఎదుర్కోవడానికి బ్యాటర్లు కాస్త వికెట్ కీపర్ లాగా వంగి ఆడాలని చెప్పాడు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

ఆస్ట్రేలియాతో గురువారం (మార్చి 9) నుంచి ఇండియా నాలుగో టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇండియన్ టీమ్ కు కీలకమైన సలహా ఇచ్చాడు సునీల్ గవాస్కర్. "స్పిన్ పిచ్ లపై నేరుగా నిల్చొని బ్యాటింగ్ చేయడం సరి కాదు. వికెట్ కీపర్ లాగా కాస్త వంగి ఆడితే మంచిది" అని గవాస్కర్ అన్నాడు.

స్పిన్ పిచ్ లపై బంతికి దగ్గరగా వెళ్లడానికి వంగి ఆడటమే కరెక్ట్ అని సన్నీ చెప్పాడు. "కాస్త వంగి ఆడితే బంతికి దగ్గరగా వెళ్లొచ్చు. అది గొప్ప వికెట్ కీపర్ లాగా. గొప్ప వికెట్ కీపర్లు బౌన్స్, బ్యాటర్లు తగినట్లు కదులుతూ ఉంటారు. అలా చేస్తే ఏ బంతికి కాస్త ముందుకు వెళ్లి ఆడాలి.. ఏ బంతికి బ్యాక్ ఫుట్ పై ఆడాలన్నది బ్యాటర్లకు తెలుస్తుంది" అని గవాస్కర్ చెప్పాడు.

డిఫెండ్ సరిగా చేయాలంటే బాటమ్ హ్యాండ్ కాస్త బలంగా ఉండాలనీ చెప్పాడు. "టాప్ హ్యాండ్ బ్యాట్ స్పీడును నిర్ణయిస్తుంది. అదే బంతిని నేరుగా ఆడాలంటే బాటమ్ హ్యాండ్ కీలకపాత్ర పోషిస్తుంది. టాప్ హ్యాండ్ తో బ్యాట్ ను కిందికి తీసుకొచ్చి నేరుగా లేదా క్రాస్ గా ఆడే వీలు కల్పిస్తుంది" అని గవాస్కర్ చెప్పాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్పిన్ పిచ్ లపై చర్చ ఎక్కువగా నడుస్తున్న నేపథ్యంలో గవాస్కర్ ఇచ్చిన సలహాలు టీమిండియాకు సాయపడే అవకాశం ఉంది. ప్రస్తుతం నాలుగు టెస్టుల సిరీస్ లో ఇండియా 2-1 ఆధిక్యంలో ఉంది. చివరి టెస్ట్ గెలిస్తే ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుతుంది.

తదుపరి వ్యాసం