తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ronaldo Instagram: 60 కోట్లు.. ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో సరికొత్త రికార్డు

Ronaldo Instagram: 60 కోట్లు.. ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో సరికొత్త రికార్డు

Hari Prasad S HT Telugu

11 August 2023, 10:19 IST

    • Ronaldo Instagram: 60 కోట్లు.. ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య ఇది. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోని తొలి వ్యక్తి ఈ పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ కావడం విశేషం.
క్రిస్టియానో రొనాల్డో
క్రిస్టియానో రొనాల్డో (REUTERS)

క్రిస్టియానో రొనాల్డో

Ronaldo Instagram: పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా యువతలో అతడంటే ఫుల్ క్రేజ్. దానికి నిదర్శనమే ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ లో అతని ఫాలోవర్ల సంఖ్య. తాజాగా ఈ ఫాలోవర్లు 60 కోట్లను తాకారు. ప్రపంచంలో మరే ఇతర వ్యక్తికీ ఇంత మంది ఫాలోవర్లు లేరు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

గతేడాది నవంబర్ లో 50 కోట్ల మార్క్ దాటిని రొనాల్డో ఫాలోవర్ల సంఖ్య.. అప్పుడే మరో 10 కోట్లు పెరగడం విశేషం. ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఫుట్‌బాలర్స్ లో ఒకడిగా పేరుగాంచిన రొనాల్డో రిటైర్మెంట్ కు దగ్గర పడుతున్నా అతని క్రేజ్ మాత్రం తగ్గకపోగా.. రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అతడు పోర్చుగల్ తోపాటు సౌదీ క్లబ్ అల్ నసర్ తరఫున ఫార్వర్డ్ ప్లేయర్ గా ఆడుతున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్ లో రొనాల్డో చాలా యాక్టివ్ గా ఉంటాడు. గతేడాది మే నెల నుంచి ఇప్పటి వరకూ అతని ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 15 కోట్లు పెరగడం విశేషం. 14 నెలల్లోనే 34 శాతం మంది ఫాలోవర్లు పెరిగారని సోషల్ బ్లేడ్ సర్వే వెల్లడించింది. ఈ రేంజ్ లో ఫాలోవర్లు ఉన్నారు కాబట్టే ఇన్‌స్టాలో రొనాల్డో చేసే ఒక్కో పోస్టుకు అదే స్థాయిలో డబ్బు అందుకుంటాడు.

రొనాల్డో తాను ఇన్‌స్టాలో చేసే ఒక్కో పోస్టుకు సుమారు 28 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.19 కోట్లు డిమాండ్ చేస్తుండటం విశేషం. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ప్రస్తుతం రొనాల్డో ఆస్తుల విలువ 50 కోట్ల డాలర్లు (సుమారు రూ.4100 కోట్లు). ప్రపంచంలోని అత్యంత సంపన్న అథ్లెట్లలో రొనాల్డో కూడా ఒకడు. క్లబ్, మ్యాచ్ ఫీజులే కాకుండా ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా రొనాల్డో భారీగా సంపాదిస్తాడు.

2023లో ప్రపంచంలో అత్యధికంగా సంపాదించిన అథ్లెట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా రొనాల్డో నెలకొల్పాడు. ఫోర్బ్స్ జాబితాలో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక మొత్తం అందుకుంటున్న టాప్ ప్లేయర్ రొనాల్డోనే.

ఇక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల విషయానికి వస్తే రొనాల్డో తర్వాత అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ 48.2 కోట్ల ఫాలోవర్లతో రెండోస్థానంలో ఉన్నాడు. అమెరికా సింగర్ సెలెనా గోమెజ్ 42.7 కోట్లతో మూడోస్థానంలో ఉంది.

తదుపరి వ్యాసం