తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hat-trick In T20 World Cup 2022: టీ20 వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్‌.. యూఏఈ బౌలర్‌ ఘనత

Hat-Trick in T20 World Cup 2022: టీ20 వరల్డ్‌కప్‌లో తొలి హ్యాట్రిక్‌.. యూఏఈ బౌలర్‌ ఘనత

Hari Prasad S HT Telugu

18 October 2022, 16:23 IST

    • Hat-Trick in T20 World Cup 2022: టీ20 వరల్డ్‌కప్‌ 2022లో తొలి హ్యాట్రిక్‌ నమోదైంది. యూఏఈ బౌలర్‌ కార్తీక్‌ మైయప్పన్‌ శ్రీలంకపై ఈ హ్యాట్రిక్‌ నమోదు చేయడం విశేషం.
శ్రీలంకపై హ్యాట్రిక్ సాధించిన యూఏఈ బౌలర్ కార్తీక్ మైయప్పన్
శ్రీలంకపై హ్యాట్రిక్ సాధించిన యూఏఈ బౌలర్ కార్తీక్ మైయప్పన్ (AFP)

శ్రీలంకపై హ్యాట్రిక్ సాధించిన యూఏఈ బౌలర్ కార్తీక్ మైయప్పన్

Hat-Trick in T20 World Cup 2022: టీ20 వరల్డ్‌కప్‌ 2022 తొలి రౌండ్‌లోనే ఓ హ్యాట్రిక్‌ నమోదైంది. మంగళవారం (అక్టోబర్‌ 18) శ్రీలంక, యూఏఈ మధ్య జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఈ హ్యాట్రిక్‌ నమోదు కావడం విశేషం. యూఏఈకి చెందిన 22 ఏళ్ల కార్తీక్‌ మైయప్పన్‌ ఈ ఘనత సాధించాడు. శ్రీలంక ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో వరుసగా మూడు బాల్స్‌లో మూడు వికెట్లు తీశాడు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

కార్తీక్‌ తన చివరి ఓవర్లో శ్రీలంక బ్యాటర్లు భనుక రాజపక్స, చరిత్‌ అసలంక, కెప్టెన్‌ డాసున్‌ శనక వికెట్లు తీశాడు. తొలి బంతికి రాజపక్స ఓ భారీ షాట్‌ ఆడటానికి ప్రయత్నించి ఔట్‌ కాగా.. రెండో బంతికి అసలంక వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఇక హ్యాట్రిక్‌ బంతిని మరింత అద్భుతంగా వేసిన కార్తీక్‌.. శనకను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో 117 స్కోరు దగ్గరే శ్రీలంక మూడు వికెట్లు కోల్పోయింది.

యూఏఈ టీ20 క్రికెట్‌ చరిత్రలో ఇదే తొలి హ్యాట్రిక్‌ కావడం మరో విశేషం. కార్తీక్‌ మైయప్పన్‌ చివరికి 4 ఓవర్లలో 19 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 రన్స్‌ చేసింది. ఓపెనర్‌ నిస్సంక 60 బాల్స్‌లో 74 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ధనంజయ డిసిల్వా 21 బాల్స్‌లో 33 రన్స్‌ చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లోనే నమీబియా చేతిలో ఓడిపోయిన లంకకు.. ఈ హ్యాట్రిక్‌ కూడా మింగుడు పడనిదే.

ఈ హ్యాట్రిక్‌ సాధించడంపై ఇన్నింగ్స్‌ తర్వాత కార్తీక్‌ స్పందించాడు. ఈ విషయాన్ని తాను నమ్మలేకపోతున్నట్లు చెప్పాడు. "ఇదో గొప్ప అనుభూతి. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. లెఫ్ట్‌ హ్యాండర్ల నుంచి బంతిని దూరంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించాను. రాజపక్స లక్కీగా డీప్‌ కవర్‌లో దొరికిపోయాడు. అసలంకను సులువుగా ఔట్‌ చేశాను. ఇక శనకను ఔట్‌ చేసిన బాల్‌ నాకు చాలా స్పెషల్‌. వికెట్‌ టు వికెట్‌ బౌలింగ్‌ చేయడం కలిసొచ్చింది" అని కార్తీక్‌ అన్నాడు.

తదుపరి వ్యాసం