తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Fifa World Cup 2022 Schedule Today: ఫిఫా వరల్డ్‌కప్‌ ఆరో రోజు షెడ్యూల్‌ ఇదే.. ఇంగ్లండ్‌ మళ్లీ చెలరేగుతుందా?

FIFA World Cup 2022 Schedule Today: ఫిఫా వరల్డ్‌కప్‌ ఆరో రోజు షెడ్యూల్‌ ఇదే.. ఇంగ్లండ్‌ మళ్లీ చెలరేగుతుందా?

Hari Prasad S HT Telugu

25 November 2022, 8:13 IST

    • FIFA World Cup 2022 Schedule Today: ఫిఫా వరల్డ్‌కప్‌ ఆరో రోజుకు చేరింది. శుక్రవారం (నవంబర్‌ 25) మరో నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో ఇంగ్లండ్‌తోపాటు ఆతిథ్య ఖతార్‌ కూడా తమ రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాయి.
మరో భారీ విజయంపై కన్నేసిన ఇంగ్లండ్
మరో భారీ విజయంపై కన్నేసిన ఇంగ్లండ్ (REUTERS)

మరో భారీ విజయంపై కన్నేసిన ఇంగ్లండ్

FIFA World Cup 2022 Schedule Today: ఫిపా వరల్డ్‌కప్‌ ఐదో రోజు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. టోర్నీ ఫేవరెట్‌ టీమ్స్‌ అయిన బ్రెజిల్‌, పోర్చుగల్‌ బోణీ చేశాయి. రొనాల్డో రికార్డు బ్రేకింగ్‌ గోల్‌తో పోర్చుగల్‌ గెలవగా.. రిచర్లీసన్‌ చెలరేగడంతో సెర్బియాను బ్రెజిల్‌ చిత్తు చేసింది. ఇక ఆరో రోజు కూడా ఫుట్‌బాల్‌ వరల్డ్‌ప్‌లో మరో నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

గ్రూప్‌ ఎ, గ్రూప్‌ బిలోని టీమ్స్ మరోసారి బరిలోకి దిగనున్నాయి. వీటిలో తొలి మ్యాచ్‌లోనే చెలరేగిపోయిన ఇంగ్లండ్‌తోపాటు ఆతిథ్య దేశం ఖతార్‌ కూడా ఉంది. తొలి మ్యాచ్‌లో ఇరాన్‌ను ఏకంగా 6-2 గోల్స్‌ తేడాతో చిత్తు చేసిన అమెరికా.. రెండో మ్యాచ్‌లో యూఎస్‌ఏతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కూడా ఇంగ్లండే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అటు యూఎస్‌ఏ తన తొలి మ్యాచ్‌ను వేల్స్‌తో డ్రా చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక గ్రూప్‌ బిలోనే వేల్స్‌, ఇరాన్‌ మధ్య మరో మ్యాచ్‌ జరగనుంది. తొలి మ్యాచ్‌లో యూఎస్‌ఏను నిలువరించిన కాన్ఫిడెన్స్‌లో వేల్స్‌ బరిలోకి దిగుతుండగా.. ఇంగ్లండ్‌ చేతుల్లో దారుణంగా దెబ్బ తిన్న ఇరాన్‌ ఒత్తిడిలో ఉంది. ఇక గ్రూప్‌ ఎలో ఆతిథ్య ఖతార్‌, సెనెగల్‌.. నెదర్లాండ్స్‌, ఈక్వెడార్‌ తలపడుతున్నాయి.

తొలి మ్యాచ్‌లో ఈక్వెడార్‌ చేతుల్లో ఓడిపోయిన ఖతార్ రెండో మ్యాచ్‌లో మరింత బలమైన జట్టయిన సెనెగల్‌తో పోటీ పడబోతోంది. ఈ మ్యాచ్‌ కూడా ఖతార్‌కు అంత సులువు కాదు. ఇక తమ తొలి మ్యాచ్‌లో సెనెగల్‌పై 2-0తో గెలిచిన నెదర్లాండ్స్‌ అదే కాన్ఫిడెన్స్‌తో ఈక్వెడార్‌ను చిత్తు చేయడానికి బరిలోకి దిగుతోంది.

ఫిఫా వరల్డ్‌కప్‌ ఆరో రోజు షెడ్యూల్‌

వేల్స్‌ vs ఇరాన్‌ - మధ్యాహ్నం 3.30

ఖతార్‌ vs సెనెగల్‌ - సాయంత్రం 6.30

నెదర్లాండ్స్‌ vs ఈక్వెడార్‌ - రాత్రి 9.30

ఇంగ్లండ్‌ vs యూఎస్‌ఏ - అర్ధరాత్రి 12.30

ఈ మ్యాచ్‌లన్నింటినీ స్పోర్ట్స్‌ 18 ఛానెల్‌ లేదా జియో సినిమా యాప్‌లో ప్రత్యక్షంగా చూడొచ్చు.

తదుపరి వ్యాసం