FIFA World Cup Brazil vs Serbia: వేట మొదలుపెట్టిన బ్రెజిల్.. తొలి మ్యాచ్‌లో సెర్బియా చిత్తు-fifa world cup brazil vs serbia as richarlisons 2 goals takes brazil to top in group g ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Fifa World Cup Brazil Vs Serbia: వేట మొదలుపెట్టిన బ్రెజిల్.. తొలి మ్యాచ్‌లో సెర్బియా చిత్తు

FIFA World Cup Brazil vs Serbia: వేట మొదలుపెట్టిన బ్రెజిల్.. తొలి మ్యాచ్‌లో సెర్బియా చిత్తు

Hari Prasad S HT Telugu
Nov 25, 2022 07:47 AM IST

FIFA World Cup Brazil vs Serbia: ఫిఫా వరల్డ్‌కప్‌ 2022లో బ్రెజిల్ తమ వేట మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌లో సెర్బియాను చిత్తు చేసింది ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన ఈ సౌత్‌ అమెరికన్‌ టీమ్‌.

బ్రెజిల్ ను గెలిపించిన రిచర్లీసన్ ను అభినందిస్తున్న టీమ్ మేట్స్
బ్రెజిల్ ను గెలిపించిన రిచర్లీసన్ ను అభినందిస్తున్న టీమ్ మేట్స్ (REUTERS)

FIFA World Cup Brazil vs Serbia: ఫిఫా వరల్డ్‌కప్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌ బ్రెజిల్ తొలి మ్యాచ్‌లోనే ఘన విజయంతో టైటిల్‌ వేట మొదలుపెట్టింది. లూసెయిల్‌ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సెర్బియాను 2-0 తేడాతో బ్రెజిల్‌ చిత్తు చేసింది. బ్రెజిల్‌ యువ సంచలనం రిచర్లిసన్‌ ఈ రెండు గోల్స్‌ చేయడం విశేషం.

ఈ ఏడాది టాప్‌ ఫామ్‌లో ఉన్న అతనికి ఏడు మ్యాచ్‌లలో ఇది 9వ గోల్‌. బ్రెజిల్‌, సెర్బియా మ్యాచ్‌లో ఫస్ట్‌ హాఫ్‌లో ఏ టీమ్‌ కూడా గోల్ చేయలేకపోయింది. అయితే 63వ నిమిషంలో రిచర్లిసన్‌ తన తొలి గోల్‌ సాధించాడు. మరో 10 నిమిషాల గ్యాప్‌లో అంటే 73వ నిమిషంలో రిచర్లీసనే మరో గోల్ చేయడంతో బ్రెజిల్‌ లీడ్‌ 2-0కు చేరింది. బ్రెజిల్‌ మ్యాచ్‌లో అందరి కళ్లూ నెయ్‌మార్‌ జూనియర్‌పై ఉండగా.. రిచర్లీసన్‌ తన షోతో ఆకట్టుకున్నాడు.

ఈ విజయంతో గ్రూప్‌ జిలో బ్రెజిల్‌ 3 పాయింట్లతో టాప్‌లో దూసుకెళ్లింది. అంతకుముందు కామెరూన్‌ను ఓడించిన స్విట్జర్లాండ్‌ రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో స్విస్‌ టీమ్ 1-0తో కామెరూన్‌పై విజయం సాధించింది. రెండు గోల్స్‌ సాధించిన బ్రెజిల్‌ స్విస్‌ టీమ్‌ను వెనక్కి నెట్టి టాప్‌లో నిలిచింది.

ఇక గ్రూప్‌ హెచ్‌లో తొలి మ్యాచ్‌లో ఘనాను 3-2తో ఓడించిన పోర్చుగల్ కూడా టాప్‌లోకి దూసుకెళ్లింది. మరోవైపు సౌత్‌ కొరియా, ఉరుగ్వే మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ గోల్‌ లేకుండా డ్రాగా ముగియడంతో ఈ రెండు టీమ్స్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.

WhatsApp channel