తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Adam Zampa Tests Covid Positive: ఆస్ట్రేలియా స్పిన్నర్‌కు కొవిడ్‌.. శ్రీలంకతో మ్యాచ్‌ ఆడతాడా?

Adam Zampa tests Covid positive: ఆస్ట్రేలియా స్పిన్నర్‌కు కొవిడ్‌.. శ్రీలంకతో మ్యాచ్‌ ఆడతాడా?

Hari Prasad S HT Telugu

25 October 2022, 14:24 IST

  • Adam Zampa tests Covid positive: ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా కొవిడ్‌ బారిన పడ్డాడు. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు అతనికి పాజిటివ్‌ అని తేలినా.. తుది జట్టులో ఆడించే అవకాశం ఉంది.

ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా
ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా (AFP/File Photo)

ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా

Adam Zampa tests Covid positive: టీ20 వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌ చేతుల్లో దారుణంగా ఓడిన డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఆస్ట్రేలియాకు శ్రీలంకతో మ్యాచ్‌కు మరో షాక్ తగిలింది. ఆ టీమ్ స్టార్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా కొవిడ్‌ బారిన పడ్డాడు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అతన్ని ఆడిస్తుందా లేదా అన్నది తెలియడం లేదు.

ట్రెండింగ్ వార్తలు

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

నిబంధనల ప్రకారం.. కొవిడ్‌ సోకిన ప్లేయర్‌ను కూడా బరిలోకి దింపడానికి అవకాశం ఉండటం విశేషం. ఈ మధ్య శ్రీలంకతో మ్యాచ్‌లో ఐర్లాండ్ ప్లేయర్‌ జార్జ్‌ డాక్రెల్‌ కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినా తుది జట్టులో ఉన్నాడు. అతడు 16 బాల్స్‌లో 14 రన్స్‌ చేశాడు. అతనికి కొవిడ్‌ ఉన్నా కూడా మ్యాచ్‌ ఆడించినట్లు క్రికెట్‌ ఐర్లాండ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇప్పుడు జంపా కూడా కొవిడ్‌ బారిన పడినా.. అతనికి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా వెల్లడించింది. శ్రీలంకతో మంగళవారం (అక్టోబర్ 25) ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఈ వరల్డ్‌కప్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల్లో ఆస్ట్రేలియా ఉంది. అది కూడా భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది.

ఎందుకంటే న్యూజిలాండ్‌ చేతిలో ఏకంగా 89 రన్స్‌ తేడాతో ఓడిన ఆసీస్.. నెట్‌ రన్‌రేట్‌ కూడా దారుణంగా ఉంది. 201 రన్స్‌ టార్గెట్‌లో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 17.3 ఓవర్లలో 111 రన్స్‌కే ఆలౌటైంది. దీంతో శ్రీలంకతో మ్యాచ్‌ కీలకం కానుంది.

ఇలాంటి పరిస్థితుల్లో స్వల్ప లక్షణాలే ఉన్న జంపాను ఆస్ట్రేలియా ఆడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అతడు మ్యాచ్‌ విన్నర్‌ కాగలడని ఈ మధ్యే ఆస్ట్రేలియా మాజీ కోచ్‌ జాన్‌ బుకానన్ అన్నాడు. గతేడాది జంపా 13 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానంలో నిలిచాడు.

తదుపరి వ్యాసం