Australia vs New Zealand T20 World Cup: ఆరంభ మ్యాచ్‌లోనే ఆసీస్ పరాజయం.. అదరగొట్టిన కివీస్-new zealand won by 89 runs against australia in t20 world cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  New Zealand Won By 89 Runs Against Australia In T20 World Cup 2022

Australia vs New Zealand T20 World Cup: ఆరంభ మ్యాచ్‌లోనే ఆసీస్ పరాజయం.. అదరగొట్టిన కివీస్

Maragani Govardhan HT Telugu
Oct 22, 2022 04:54 PM IST

Australia vs New Zealand T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. కివీస్ ఓపెనర్ 92 పరుగులతో ఆకట్టుకున్నాడు.

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్
ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ (AP)

Australia vs New Zealand T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. 89 పరుగుల భారీ తేడాతో గెలిచింది. సూపర్ 12లో తొలి మ్యాచ్‌లోనే ఆసీస్ ఘోరంగా పరాజయం పాలైంది. కివీస్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 111 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 28 పరుగులు మినహా మిగిలిన వారు పెద్దగా రాణించలేకపోయారు. పేలవ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమిని చవిచూసింది. మరోపక్క కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, మిషెల్ సాంట్నర్ చెరో మూడు వికెట్లతో రాణించగా.. ట్రెంట్ బౌల్డ్ రెండు వికెట్లు తీశాడు.

ట్రెండింగ్ వార్తలు

201 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా ఆసీస్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను(5) టిమ్మ సౌథీ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం కాసేపటికే కెప్టెన్ ఫించ్‌(13)ను సాంట్నర్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తదుపరి ఓవర్‌లోనే మిషెల్ మార్ష్‌(16)ను కూడా వెనక్కి పంపాడు సౌథీ. ఫలితంగా 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది కంగారూ జట్టు. ఆ కాసపేటికే స్టాయినీస్‌ను(7) కూడా సాంట్నర్ ఔట్ చేశాడు. అనంతరం ప్రమాదకర టిమ్ డేవిడ్‌ను(11) పెవిలియన్ చేర్చాడు. ఫలితంగా టాపార్డర్‌లో మూడు కీలక వికెట్లు పడగొట్టి ఆసీస్ పతనాన్ని శాసించాడు సాంట్నర్.

అప్పటి నుంచి క్రమేణా వికెట్లు కోల్పోవడం జరుగుతూనే ఉంది. గ్లెన్ మ్యాక్స్ వెల్(28) కాసేపు క్రీజులో నిలుచునేందుకు ప్రయత్నించిప్పటికీ ఎక్కువ సేపు ఆదుకోలేకపోయాడు. ముందు మ్యాథ్యూ వేడ్(2), తర్వాత మ్యాక్స్‌వెల్ ఇలా వరుసగా వికెట్లను కోల్పోయింది. ఇక టెయిలెండర్లు కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు. మూడు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. టెయిలెండర్లను ట్రెంట్ బౌల్ట్ సులభంగా పెవిలియన్ చేర్చాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ అదిరిపోయే ప్రదర్శన చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు డేవాన్ కాన్వే- ఫిన్ అలెన్ మొదటి వికెట్‌కు 56 పరుగుల భాగాస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా కాన్వే 92 పరుగులతో అద్భుత అర్ధశతకాన్ని సాధించాడు. ఇందులో ఏడు ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మరోపక్క అలెన్ కూడా 16 బంతుల్లో 42 పరుగులతో విధ్వసం సృష్టించాడు. చివర్లో నీషమ్ 13 బంతుల్లో 26 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా కివీస్ భారీ స్కోరు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 2 వికెట్లు తీయగా.. ఆడం జంప్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం