తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Maha Shivratri 2023 : శివరాత్రికి చంద్రుడి పూజ చేయాలి.. మంత్రం ఇదే

Maha Shivratri 2023 : శివరాత్రికి చంద్రుడి పూజ చేయాలి.. మంత్రం ఇదే

HT Telugu Desk HT Telugu

11 February 2023, 11:10 IST

    • Maha Shivratri 2023 : మహా శివరాత్రి పండగ వస్తోంది. దేవదేవుడి నామస్మరణతో ఆలయాలు మారుమోగిపోనున్నాయి. అయితే ఆ రోజున శివుడితోపాటుగా చంద్రుడిని పూజిస్తే.. శుభప్రదం అని చెబుతారు.
మహా శివరాత్రి
మహా శివరాత్రి (unsplash)

మహా శివరాత్రి

ఫిబ్రవరి 18న మహాశివరాత్రి(Mahashivaratri) నాడు, ప్రజలు శివునితో పాటు చంద్రుడి(Chandra Dev)ని పూజించడం శుభప్రదం. ఆరోజున శ్రావణ నక్షత్రం, చంద్రుడు మకరరాశిలో ఉంటాడు. ఈ రోజున చంద్రుడిని పూజించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. శ్రవణ నక్షత్రానికి చంద్రుడు అధిపతి. శివుడి తల మీద చంద్రుడు ఉంటాడు. ఈ కారణాలతో మహా శివరాత్రి రోజున శివునితో పాటు, చంద్రదేవుడిని కూడా పూజించాలి.

లేటెస్ట్ ఫోటోలు

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

Mercury transit: వీరి మీద కనక వర్షం కురిపించబోతున్న బుధుడు.. అందులో మీరు ఉన్నారా?

May 16, 2024, 01:34 PM

Jupiter combust: అస్తంగత్వ దశలోకి గురు గ్రహం.. వీరికి అప్పులు, సమస్యలు, కష్టాలే

May 16, 2024, 01:11 PM

వృషభ రాశిలో సూర్యుడు: నెలపాటు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.. ఈ ఇబ్బందులు కలగొచ్చు

May 16, 2024, 12:10 PM

Guru Aditya yoga: 12 ఏళ్ల తర్వాత గురు ఆదిత్య యోగం.. వీరికి గౌరవం, డబ్బు, అన్నింటా విజయం

May 16, 2024, 08:25 AM

మే 16, రేపటి రాశి ఫలాలు.. రేపు మీకు మంచి రోజు అవుతుందో కాదో ఇప్పుడే తెలుసుకోండి

May 15, 2024, 08:22 PM

శివుని నుదుటిపై చంద్రుడు ఉండటం వల్ల భగవంతుడికి ప్రశాంతత చేకూరుతుందని చెబుతారు. పాత కథల ప్రకారం, చంద్రదేవుడు(Chandra Devudu).. దక్ష ప్రజాపతి 27 మంది కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. అయితే చంద్రుడు రోహిణిపై మాత్రమే ఎక్కువ శ్రద్ధ చూపేవాడు. ఇది ఇతర 26 మంది భార్యలకు మింగుడు పడలేదు. అందుచేత వారందరూ చంద్రదేవుని గురించి తండ్రి దక్షునికి మొరపెట్టుకున్నారు.

తన కుమార్తెల ఫిర్యాదులను విన్న దక్షుడు చంద్రదేవునిపై కోపించి అతన్ని శపించాడు. దక్షుడు ఇచ్చిన శాపంతో చంద్రుడు ఇబ్బందులు పడతాడు. ఆ సమయంలో శివుడిని పూజిస్తేనే మంచి జరుగుతుందని చెబుతారు. దీంతో చంద్రుడు శివుడికి పూజ చేస్తాడని అంటారు. శివుడిని పూజించిన వారికి అన్ని రోగాలు నయమవుతాయని, వారి ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుంటుందని నమ్ముతారు.

మహాశివరాత్రి(Mahashiva Ratri) రోజు ఉదయాన్నే లేవాలని చెబుతారు. స్నానం చేసిన తర్వాత గణేశుడిని పూజించి, శివుడిని పూజించి, చివరగా చంద్రదేవుడిని పూజించాలి. చంద్రదేవుని విగ్రహానికి పాలతో అభిషేకం చేయాలి. చంద్రదేవుని విగ్రహం లేకపోతే, శివుని తలపై కూర్చున్న చంద్రుడిని పూజించవచ్చు.

ఈ రోజున ప్రజలు పాలతో చేసిన తీపి పదార్థాలను పెడతారు. ధూపం, దీపాలను వెలిగించి హారతి చేస్తారు. చంద్ర పూజ చేస్తున్నప్పుడు 'ఓం సోం సోమాయ నమః' మంత్రాన్ని జపిస్తారు. చంద్ర పూజతో పాటు, ప్రజలు ఈ పవిత్రమైన రోజున అవసరమైన వారికి పాలను దానం చేస్తారు.

తదుపరి వ్యాసం