తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jupiter Transit: బృహస్పతి సంచారం వల్ల నష్టాలు ఎదుర్కోబోతున్న రాశులు ఇవే.. ఇందులో మీ రాశి ఉందా?

Jupiter transit: బృహస్పతి సంచారం వల్ల నష్టాలు ఎదుర్కోబోతున్న రాశులు ఇవే.. ఇందులో మీ రాశి ఉందా?

Gunti Soundarya HT Telugu

18 March 2024, 13:15 IST

    • Jupiter transit: త్వరలో బృహస్పతి మేష రాశి నుంచి వృషభ రాశి సంచారం చేయబోతున్నాడు. ఫలితంగా కొన్ని రాశుల వాళ్ళు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమస్యలు పలకరిస్తాయి.
బృహస్పతి రాశి మార్పు వల్ల ఇబ్బందులు పడే రాశులు ఇవే
బృహస్పతి రాశి మార్పు వల్ల ఇబ్బందులు పడే రాశులు ఇవే (pixabay)

బృహస్పతి రాశి మార్పు వల్ల ఇబ్బందులు పడే రాశులు ఇవే

Jupiter transit: దేవగురువుగా పరిగణించే బృహస్పతి త్వరలో తన రాశి మార్చుకోబోతున్నాడు. దీని ప్రభావం మొత్తం 12 రాశుల మీద కనిపిస్తుంది. ప్రస్తుతం గురు గ్రహం మేష రాశిలో సంచరిస్తోంది. మే 1వ తేదీన వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. దీనివల్ల కొన్ని రాశులకు అదృష్టం కలుగుతుంది. మరి కొంతమందరు మాత్రం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

లేటెస్ట్ ఫోటోలు

మే 21, రేపటి రాశి ఫలాలు.. రేపు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి శుభవార్త వింటారు

May 20, 2024, 08:19 PM

Budhaditya raja yogam: బుధాదిత్య రాజయోగం.. వీరికి పెళ్లి కుదురుతుంది, ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది

May 20, 2024, 05:54 PM

భద్ర మహాపురుష రాజ యోగంతో ఈ రాశుల జాతకులకు కొత్త అవకాశాలు, శుభ ఘడియలు

May 20, 2024, 05:31 PM

30 ఏళ్ల తరువాత అదృష్ట రాజయోగం.. ఈ 3 రాశులకు శుభ ఘడియలు

May 20, 2024, 11:30 AM

Gajalakshmi Yogam : గజలక్ష్మీ యోగం.. వీరికి అప్పులు తీరుతాయి.. వ్యాపారంలో లాభాలు!

May 20, 2024, 07:58 AM

ఈ 3 రాశులకు అదృష్ట యోగం- డబ్బుకు డబ్బు, సక్సెస్​!

May 19, 2024, 01:24 PM

బృహస్పతి ఆనందం, సంపదలను ఇస్తాడు. అనుకూలమైన స్థానంలో ఉంటే వారి జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయి. వృషభ రాశిలోకి బృహస్పతి సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల జాతకులు కష్టాలు, నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బృహస్పతి రాశి మార్పు ఏ రాశి వారికి ప్రతికూల ప్రభావాలు ఇస్తుందో చూడండి. అందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.

వృషభ రాశి

2024 లో బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉండకపోవచ్చు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ క్రియ, జీవక్రియ వంటి సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యల గురించి అప్రమత్తంగా ఉండటం అవసరం. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు, ఆర్థిక విషయాలపై వ్యాపార భాగస్వాములతో తగాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. సంబంధాలలో ఉద్రిక్తత ఏర్పడుతుంది. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. మనసు నెగిటివ్ ఫీలింగ్ తో నిండిపోతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది.

కన్యా రాశి

బృహస్పతి సంచారం కన్యా రాశికి అంత ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. ఆర్థికపరమైన జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. జీవితంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

తులా రాశి

తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు బృహస్పతి సంచారం ప్రతికూల ప్రభావాలను ఇస్తుంది. తోబుట్టువులతో సంబంధాలు బలహీన పడతాయి. ఆరోగ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కెరీర్ కోసం కృషి చేయాలి. కార్యాలయంలో సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అప్పులు తీసుకోకుండా ఉండటం మంచిది. బృహస్పతి బలహీన స్థానం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడికి ఒత్తిడికి దూరంగా ఉండండి.

ధనుస్సు రాశి

బృహస్పతి పాలించే ధనుస్సు రాశి వారికి కూడా సవాళ్ళు ఎదురుకాబోతున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. చట్టపరంగా అనేక చిక్కులు ఎదురవుతాయి. వాటి నుంచి బయటపడటం చాలా కష్టంగా మారుతుంది. ఆర్థిక వ్యయాలు కూడా పెరుగుతాయి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో గొడవలు జరుగుతాయి.

మీన రాశి

మీన రాశికి బృహస్పతి అధిపతిగా ఉంటాడు. అయితే దేవ గురువు సంచారం ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. మీన రాశి మూడో ఇంట్లో గురు సంచారం జరుగుతుంది. ఫలితంగా పనుల్లో బద్ధకంగా ఉంటారు. పనులు వాయిదా వేసే ధోరణి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుగుచుకోవాలి. విజయం సాధించేందుకు శ్రద్ధ, పట్టుదల చాలా అవసరం. సోమరితనం కంటే పనికి ప్రాధాన్యత ఇవ్వాలి.

తదుపరి వ్యాసం