తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Kartik Deepam : పొరపాటున కూడా దీపం ఇలా వెలిగించొద్దు.. అశుభం

Kartik Deepam : పొరపాటున కూడా దీపం ఇలా వెలిగించొద్దు.. అశుభం

Anand Sai HT Telugu

26 November 2023, 8:24 IST

    • Kartik Purnima 2023 : కార్తీక మాసం చాలా పవిత్రమైనది. కార్తీక దీపం వెలిగించేప్పుడు కొన్ని తప్పులు చేయకూడదు. అలా చేస్తే మీ అశుభం అని పండితులు అంటున్నారు. ఎలాంటి తప్పులు చేయెుద్దో తెలుసుకుందాం..
కార్తీక దీపం
కార్తీక దీపం (unsplash)

కార్తీక దీపం

దీపం పెట్టేందుకు సరైన నియమం ఉంది. ఈ నియమం అందరికీ తెలియదు కాబట్టి దీపం వెలిగించేటపుడు తరచూ పొరపాట్లు చేస్తుంటారు. ఈ తప్పు వల్ల దీపం వెలిగించినా పూర్తి ప్రయోజనం పొందలేరు. హిందూ ధర్మంలో దీపం వెలిగించడం చాలా ప్రత్యేకం. ప్రతీ పండగకు దీపాలు ఉంటాయి. అందులో కార్తీక మాసం అంటే చాలా పవిత్రత ఉంటుంది.

లేటెస్ట్ ఫోటోలు

మే 15, రేపటి రాశి ఫలాలు.. మీ కుటుంబంలోకి వచ్చే కొత్త అతిథి వల్ల గొడవలు వస్తాయ్

May 14, 2024, 08:30 PM

Bad Luck Rasis: గురు భగవానుడి ఆగ్రహాన్ని ఎదుర్కోబోయే రాశులు ఇవే.. వీరికి బ్యాడ్ టైమ్ రాబోతుంది

May 14, 2024, 02:33 PM

Jupiter venus conjunction: వృషభ రాశిలో గురు శుక్ర కలయిక.. వీరి ప్రేమ జీవితం రొమాన్స్ తో నిండిపోతుంది

May 14, 2024, 10:30 AM

మే 19 నుంచి ఈ రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు.. ఉద్యోగంలో ప్రమోషన్​- ధన లాభం!

May 14, 2024, 09:35 AM

మే 14, రేపటి రాశి ఫలాలు.. రేపు శత్రువుల నుంచి వీరికి ఆర్థిక లాభాలు

May 13, 2024, 08:09 PM

Rahu transit: రాహు గ్రహ అనుగ్రహం.. 2025 వరకు ఈ రాశుల వారికి దేనికి ఢోకా లేదు

May 13, 2024, 06:27 PM

ఇప్పుడు కార్తీకమాసం నడుస్తోంది. ఈ మాసంలో దీపం వెలిగించడం చాలా ముఖ్యమైనదని చెబుతారు. అలాగే కార్తీక దీపం నాడు మన ఇళ్లలో చాలా ప్రదేశాలను దీపాలతో అలంకరిస్తారు. ఈ రోజున దీపం వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయని విశ్వాసం. కార్తీక మాసంలో ఇంటిని దీపాలతో అలంకరించుకోవడం తప్పు కాదు. కానీ దీపం సరిగా పెట్టడం చాలా ముఖ్యం. సరైన నియమాలు, పద్ధతుల ప్రకారం మీరు దీపం వెలిగించకపోతే, మీరు అనేక నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీపం పెట్టేందుకు సరైన నియమం గురించి ఇక్కడ తెలుసుకోండి.

స్వచ్ఛమైన దీపం.. అంటే గతంలో కాల్చిన వత్తి లేదా నూనె లేకుండా శుభ్రమైన దీపం. పాత కాలిన దీపాన్ని పూర్తిగా నీటితో శుభ్రం చేసి దీపాన్ని వెలిగించాలి. పాత దీపాన్ని వెలిగించకూడదని గుర్తుంచుకోండి.

దీపాన్ని వెలిగించడానికి ఇత్తడి, రాగి, మట్టితో చేసిన దీపాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఇది ఉత్తమమైనది, పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. అందువల్ల, ఇతర లోహాలతో చేసిన దీపాలను ఉపయోగించవద్దు. ప్రయోజనం ఉండదు.

ఇత్తడి దీపంలో దీపం వెలిగించేటప్పుడు వత్తి, నెయ్యి, నూనె, పసుపు బియ్యం, పూల రేకులు వేసి దీపం వెలిగించాలి.

అలాగే దీపం వెలిగించడానికి నెయ్యి, ఆవనూనె, నువ్వుల నూనె వాడండి.. చాలా మంది తమకు తెలియకుండానే అన్ని దేవతల ముందు రకరకాల దీపాలు వెలిగిస్తారు. కొన్ని నూనె దీపాలు కొన్ని ప్రత్యేక రోజులు, తేదీలు, దేవతలకు మాత్రమే అంకితం చేయబడతాయి. తెలియకుండా దీపం వెలిగించడానికి ఉపయోగించవద్దు. ఈ కార్తీకమాసం చాలా పవిత్రమైనది. దీపాలు వెలిగించే ముందు పైన చెప్పిన విషయాలు గుర్తుంచుకోండి. మీకు అంతా శుభమే కలుగుతుంది.

తదుపరి వ్యాసం