నెయ్యి, కర్పూరంతో జలుబు, దగ్గుకు మందు.. ఇంట్లోనే సింపుల్‍గా చేయెుచ్చు-how to make medicine in house for cold and cough remedies at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  నెయ్యి, కర్పూరంతో జలుబు, దగ్గుకు మందు.. ఇంట్లోనే సింపుల్‍గా చేయెుచ్చు

నెయ్యి, కర్పూరంతో జలుబు, దగ్గుకు మందు.. ఇంట్లోనే సింపుల్‍గా చేయెుచ్చు

Anand Sai HT Telugu
Nov 13, 2023 03:53 PM IST

Health Tips : వాతావరణం మారుతుంది. దగ్గు, జలుబు సమస్యలు ఎక్కువగా వస్తు్న్నాయి. ఇంట్లోనే మందు తయారు చేసుకుంటే కాస్త ఉపశమనం పొందొచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

దగ్గు, జలుబు, ముక్కు మూసుకుపోవడంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. దీనికోసం మార్కెట్లో దొరికేవి కొన్ని ఉపయోగిస్తే.. ఇంటి నివారణలను మరికొన్నింటిని వాడుతుంటారు. అయితే మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కొన్నిసార్లు హాని కలిగించొచ్చు. అందుకే ఇంట్లోనే తయారు చేసుకునే వాటిని ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచిది. చాలా ఈజీ.. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..

జలుబు, ముక్కు కారడం, దగ్గులాంటివి సీజనల్ సమస్యలు. ఇవి చాలా సాధారణం అని అనుకోవద్దు. నివారణ చర్యలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. సాధారణంగా మనమందరం ఈ సమయంలో ఎక్కువశాతం మార్కెట్లో దొరికేవి ఉపయోగిస్తాం. అలాంటప్పుడు ఈ తరహా సమస్యలకు స్టోర్లలో కొనే బదులుగా ఇంట్లోనే మందు తయారు చేసుకోవచ్చు. అది ఎలా అని మీరు ఆశ్చర్యపోవచ్చు... కానీ చాలా ఈజీ.

కావలసిన పదార్థాలు :

నెయ్యి - 4-5 స్పూన్లు

పచ్చ కర్పూరం - 2

గాజు పాత్ర - 1

ఎలా తయారు చేయాలి :

ఇంట్లో దగ్గు, జలుబుకు మందు తయారు చేయడానికి, ముందుగా స్టవ్ మీద పాన్ ఉంచండి. పాన్ వేడి కాగానే నెయ్యి వేయాలి. తర్వాత కర్పూరం వేయాలి. కర్పూరం కరిగిన తర్వాత, స్టవ్ నుండి పాన్ తీయాలి. తర్వాత వీటిని గాజు పాత్రలో ఉంచండి. ఇప్పుడు మందు సిద్ధంగా ఉంది. చల్లారిన తర్వాత వాడుకోవచ్చు. మీరు దీన్ని మొదటిసారి ఉపయోగించినప్పుడు, మీ చర్మంలోని ఒక విభాగానికి అప్లై చేసి, మీ శరీరానికి అలెర్జీ కాదా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి. దీన్ని 3 రోజుల కంటే ఎక్కువ ఉపయోగించకూడదు. కొంతమంది చర్మానికి ఇది సరిపోదు. అలెర్జీ వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో తయారు చేసిన ఈ మందును ఉపయోగించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి

ఇది దుకాణంలో కొనుగోలు చేసిన వాటి కంటే చాలా మంచిదని కొంతమంది నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పురాతన కాలంలోనూ ఈ పద్ధతిని పాటించేవారు అని చెబుతున్నారు. సహజంగా నెయ్యి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. నెయ్యి ఉంటుంది. ఇది చర్మానికి చాలా సురక్షితమైనదని పేర్కొంటున్నారు. దీనిని 10 ఏళ్ల పిల్లల నుండి పెద్దల వరకు ఉపయోగించవచ్చు. ముఖ్యంగా జలుబు, దగ్గుతో బాధపడేవారు.. ఛాతీ, గొంతు దగ్గర రాసుకోవచ్చు.

అయితే కొంతమంది మాత్రం పిల్లలకు కర్పూరం వాడకూడదని హెచ్చరిస్తున్నారు. పరిశోధన ప్రకారం, రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉపయోగిస్తే.. ఇది ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మూర్ఛను కలిగిస్తుంది. పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.. కాబట్టి, చర్మ అలెర్జీలకు కారణం కావొచ్చు. పిల్లలకు ఇది వాడకపోవడమే మంచిది.

పిల్లలకు జలుబు, ముక్కు మూసుకుపోయినట్లయితే, వారి ముక్కు రంధ్రాలలో వేసేందుకు కొన్ని రకాల చుక్కులు దొరుకుతాయి. వైద్యుడిని సంప్రదిస్తే.. వాటిని రాసి ఇస్తారు.