తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Navaratri 6th Day : దేవి నవరాత్రి ఆరవరోజు.. మహాలక్ష్మీదేవిగా అమ్మవారి దర్శనం

Navaratri 6th Day : దేవి నవరాత్రి ఆరవరోజు.. మహాలక్ష్మీదేవిగా అమ్మవారి దర్శనం

01 October 2022, 4:30 IST

    • Navaratri Sri Mahalakshmi Devi Darshanam : నవరాత్రుల్లో భాగంగా.. అమ్మవారు ఆరవరోజు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. నవరాత్రుల్లో ఆరవ రోజు చాలా విశేషమైనదని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అయితే దేవీ నవరాత్రులో ప్రాంతాలను బట్టి అమ్మవారిని అలంకరిస్తారని ఆయన పేర్కొన్నారు.
శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం
శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం

శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం

Navaratri Sri Mahalakshmi Devi Darshanam : దేవీ నవరాత్రులలో 9 రోజులు చాలా విశేషమైనవి. ఈ 9 రోజులు అమ్మవారిని 9 అలంకరణలు, 9 రకాల దేవతారాధనలు, 9 రకాల నైవేద్యములు సమర్పిస్తారు. నవరాత్రులలో తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించలేనటువంటి వారికి అతి ముఖ్యమైన 3 రోజులు, 3 అవతారములు, 6,7,8 రోజులలోని అమ్మవారి అవతారాలు.

లేటెస్ట్ ఫోటోలు

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

Mercury transit: వీరి మీద కనక వర్షం కురిపించబోతున్న బుధుడు.. అందులో మీరు ఉన్నారా?

May 16, 2024, 01:34 PM

ఈరోజు ఆశ్వయుజ మాస శుక్ల పక్ష షష్ఠి ఆరవ అవతారం విశేషమైనటువంటి అవతారం. అదే శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం. ఈ రోజు అమ్మవారికి గులాబీ రంగు వస్త్రాన్ని అలంకరిస్తారు. బెల్లముతో చేసిన క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారిని ఈ రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో పూజించాలి.

సనాతన ధర్మంలో దైవారాధనలు మూడు రకములుగా ఉన్నవి.

1. శివారాధన

2. విష్ణు ఆరాధన

3. శక్తి ఆరాధన.

శక్తి ఆరాధన అనగా అమ్మవారైనటువంటి సరస్వతి, లక్ష్మీ, దుర్గాదేవి ఆరాధన. శక్తి ఆరాధనలకు శరన్నవరాత్రులకు మించినటువంటి రోజు మరొకటి లేదు. విజయవాడ కనకదుర్గమ్మ అలంకరాల ప్రకారం నవరాత్రులలో ఆరవ రోజు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారం. దేవీ నవరాత్రులో ప్రాంతాలను బట్టి అమ్మవారి అలంకరణలు ఉంటాయి. ఐదవ రోజు అంటే నిన్న అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

దేవీ భాగవతం ప్రకారం..

పూర్వం మధుకైటంబులు అనే రాక్షసులను వధించటానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువుని నిద్రలేపడం, యోగనిద్ర నుంచి లేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాలు ఆ రాక్షసులతో యుద్ధం చేశారు. అయినా విష్ణువు వారిని జయించలేకపోయారు. ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ మధుకైటంబు రాక్షసులను మోహపూరితులను చేసింది. దాంతో వారు మహావిష్ణువును మెచ్చుకుని నీకు ఏ వరం కావాలి అని అడిగారు. శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు. దానితో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తధ్యమని గ్రహించి తమను నీరు లేనిచోట చంపమని కోరుతారు.

అంతటితో శ్రీ మహావిష్ణువు వారిని పైకెత్తి భూఅంతరాలలో సంహరించు సమయంలో.. మహామాయ పదితలలతో, పది కాళ్లతో, నల్లని రూపుతో మహాకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువుకు సహాయపడింది. ఈ విధముగా మహా మాయ అయిన అమ్మవారు.. మహావిష్ణువుతో కలిసి రాక్షస సంహారం చేశారు. కంస సంహారమునకు సహాయపడుటకై నందా అనే పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణుడికి సహాయపడ్డారు అమ్మవారు. సింహవాహినిగా మహిసాసురుని సరస్వతీ రూపిణిగా సుబ, నుసుంబులను ఛండ ముండులను సంహరించిన ఛాముండి, లోకాలను కరువునుంచి రక్షించినందుకు శాఖాంబరి, దుర్గుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు దుర్గగా ఇలా నవరూపాలను అమ్మవారు అవతారాలుగా చెప్తారు.

తదుపరి వ్యాసం