తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  సీటు కింద బ్యాటరీ పేలొచ్చు జాగ్రత్త! ఎలక్ట్రిక్ వాహనాలను కొనేముందు నాణ్యత చూడండి

సీటు కింద బ్యాటరీ పేలొచ్చు జాగ్రత్త! ఎలక్ట్రిక్ వాహనాలను కొనేముందు నాణ్యత చూడండి

Manda Vikas HT Telugu

04 January 2022, 9:41 IST

    • ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. బ్యాటరీ ఆధారంతో నడిచే ఆ స్కూటీ సీటు కింద అమర్చిన బ్యాటరీ పేలడంతో మంటలు చెలరేగి, స్కూటర్ పూర్తిగా దగ్ధమైంది. ఆ స్కూటర్ పేలటానికి కారణం అందులోని బ్యాటరీ ఎలక్ట్రిక్ సర్క్యూట్ కు గురవడమే కారణం అనివార్తలు వచ్చాయి.
File Image of EV Battery Explosion
File Image of EV Battery Explosion (Twitter)

File Image of EV Battery Explosion

ఏదైనా ఒక ఫోన్ బ్యాటరీ పేలింది అంటే అదేమి పెద్ద వార్త అనిపించందు, ఎందుకంటే ఇలాంటి సంఘటనలకు గురించిన వార్తలు మనం చాలా చూసుంటాం. అదే ఏదైనా ఒక ఎలక్ట్రిక్ వాహనానికి సంబంధించిన వార్తయితే? మరీ ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీలు సీటు కిందనే అమర్చుతారు, అలాంటపుడు ఆ బ్యాటరీ పేలితే పరిస్థితి ఏంటి? పుష్పాసనం బద్ధలవడం ఖాయమే కదా! 

ఇటీవల అలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఎక్కడో కాదు, మన హైదరాబాద్‌లోనే! ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. బ్యాటరీ ఆధారంతో నడిచే ఆ స్కూటీ సీటు కింద అమర్చిన బ్యాటరీ పేలడంతో మంటలు చెలరేగి, స్కూటర్ పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం ఆ స్కూటర్ పార్క్ చేసినపుడు జరిగింది. అదే డ్రైవ్ చేసేటపుడు జరిగుంటే అప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది. ఇక ఆ స్కూటర్ పేలటానికి కారణం అందులోని బ్యాటరీ ఎలక్ట్రిక్ సర్క్యూట్ కు గురవడమే కారణం అనివార్తలు వచ్చాయి.

ఇంధనంతో నడిచే వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపుగా ప్రపంచంతో పాటు భారత్ పరుగులు పెడుతుంది. ఒకవైపు ఆకాశన్నంటుతున్న ఇంధన ధరలు, మరోవైపు పెరుగుతున్న వాయు కాలుష్యం ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు భారత ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేలా వాహనదారులను ప్రోత్సహిస్తుంది. ఇలాంటి తరుణంలో బ్యాటరీ పేలడం లాంటి ఘటనలు జరగటం ఆందోళన కలిగించేవే. 

అయినా ఇక్కడ భయభ్రాంతులకు గురవ్వాల్సిన పనిలేదు, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయకూడదని నెగెటివ్ ఆలోచనలు పెట్టుకోవడం సరికాదు. కాకపోతే నాణ్యత విషయంలో రాజీపడొద్దు. కాస్త ధర ఎక్కువైనా, బ్యాటరీ నాణ్యత ఎలాంటిది, వారెంటీ ఎంతవరకు ఇస్తున్నారు, ప్రమాద బీమా ఏమైనా కల్పిస్తున్నారా? అనే విషయాలు పరిగణలోకి తీసుకొని నిరభ్యంతరంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయవచ్చు. 

 

తదుపరి వ్యాసం