తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Himachal New Cm: హిమాచల్ నూతన ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్

Himachal new CM: హిమాచల్ నూతన ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్

HT Telugu Desk HT Telugu

10 December 2022, 22:42 IST

  • Himachal new CM: హిమాచల్ ప్రదేశ్ కొత్త సీఎంగా కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్విందర్ సింగ్ సుక్కు ఎంపికయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

హిమాచల్ ప్రదేశ్ కొత్త సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు
హిమాచల్ ప్రదేశ్ కొత్త సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు

హిమాచల్ ప్రదేశ్ కొత్త సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు

Himachal new CM: హిమాచల్ ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరు కానున్నారన్న విషయంలో నెలకొన్న ఉత్కంఠ వీడింది. పార్టీ అధిష్టానం కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్వీందర్ సింగ్ సుక్కును కొత్త సీఎంగా ఎంపిక చేసింది.

Himachal new CM Sukhwinder Singh Sukhu: గట్టి పోటీ మధ్య..

హిమాచల్ సీఎం పదవికి కూడా కాంగ్రెస్ లో గట్టి పోటీ నెలకొంది. మాజీ సీఎం వీర భద్ర సింగ్ భార్య, పీసీసీ ప్రెసిడెంట్ ప్రతిభ సింగ్ కూడా సీఎం పదవిని ఆశించారు. వీరభద్ర సింగ్ కుటుంబానికే సీఎం పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అయితే, ప్రతిభ సింగ్ కుమారుడికి కేబినెట్ లో కీలక పదవి లభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం కాంగ్రెస్ తరఫున ఎన్నికైన నూతన ఎమ్మెల్యేలు మరోసారి సమావేశమై, సుఖ్వీందర్ సింగ్ సుక్కును శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. సుఖ్వీందర్ సింగ్ తో పాటు కొందరు కేబినెట్ మంత్రులు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Who is Sukhwinder Singh Sukhu: ఎవరీ సుఖ్వీందర్?

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లో సుఖ్వీందర్ సింగ్ సుక్కు సీనియర్ నేత. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పని చేశారు. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా సుక్కుకు పేరుంది. విద్యార్థి రాజకీయాలతో రాజకీయ జీవితం ప్రారంభించిన సుఖ్వీందర్.. కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ ఎస్ యూ ఐ లో పనిచేశారు. 1998 నుంచి 2008 వరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా పని చేశారు. 2013లో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. విద్యార్థి, యువజన కాంగ్రెస్ నాయకుడిగా దశాబ్దాల పాటు పని చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులతో సుఖ్వీందర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం వెనుక సుఖ్వీందర్ వ్యూహాలు కూడా ఉన్నాయి. 68 సీట్ల హిమాచల్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు సాధించి అధికారంలోకి రానున్న విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం