తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Saveera Parkash: 2024 పాక్ ఎన్నికల బరిలో తొలిసారి హిందూ మహిళ..

Saveera Parkash: 2024 పాక్ ఎన్నికల బరిలో తొలిసారి హిందూ మహిళ..

HT Telugu Desk HT Telugu

26 December 2023, 17:34 IST

  • First Hindu woman contestant in pak polls: 2024 ఫిబ్రవరి లో పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. పాక్ రాజకీయ చరిత్రలోనే తొలిసారి ఒక హిందూ మహిళ ఈ ఎన్నికల్లో పోటీ పడుతుండడం విశేషం.

డాక్టర్ సవీరా ప్రకాశ్
డాక్టర్ సవీరా ప్రకాశ్ (X/RabNBaloch)

డాక్టర్ సవీరా ప్రకాశ్

First Hindu woman contestant in pak polls: పాకిస్థాన్ లో 2024లో జరగనున్న ఎన్నికల్లో జనరల్ స్థానానికి ఓ హిందూ (hindu) మహిళ నామినేషన్ దాఖలు చేసింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బునేర్ జిల్లాలోని పీకే-25 జనరల్ స్థానానికి సవీరా ప్రకాశ్ మంగళవారం అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు.

ఫిబ్రవరి 8న

పాకిస్థాన్ లోని 16వ జాతీయ అసెంబ్లీ సభ్యులను ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 8న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం (ఈసీపీ) ఇటీవల చేసిన సవరణల ప్రకారం జనరల్ సీట్లలో ఐదు శాతం మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది.

ఎవరీ సవీరా ప్రకాశ్?

  1. పాకిస్థాన్ లోని హిందూ కమ్యూనిటీకి చెందిన సవీరా ప్రకాశ్ సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన తొలి మహిళా అభ్యర్థి.
  2. సవీరా ప్రకాశ్ తండ్రి రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడు ఓం ప్రకాశ్. డాక్టర్ ఓం ప్రకాశ్ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) లో ప్రత్యేక సభ్యుడు గా ఉన్నారు.
  3. తండ్రి అడుగుజాడల్లోనే సవీరా కూడా క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఆమె బునేరులోని పీపీపీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
  4. 2022లో అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో సవీరా ప్రకాశ్ ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
  5. మహిళల అభ్యున్నతి కోసం పనిచేయడం, వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం మరియు వారి హక్కుల కోసం వాదించడం తన లక్ష్యమని సవీరా ప్రకాశ్ చెప్పారు. సేవ చేయడం తన రక్తంలోనే ఉందన్నారు.
  6. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనెలకొన్న దారుణ పరిస్థితులను చూసిన తరువాత ప్రజాప్రతినిధిగా మాత్రమే పరిస్థితులను చక్కదిద్దగలనని భావించానన్నారు.

తదుపరి వ్యాసం