తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chandrayaan-3: ‘చంద్రయాన్ 3’ వెనుక కీలక శక్తి ఈ మహిళ.. డాక్టర్ రీతు కరిధాల్.. ‘రాకెట్ విమన్ ఆఫ్ ఇండియా’

Chandrayaan-3: ‘చంద్రయాన్ 3’ వెనుక కీలక శక్తి ఈ మహిళ.. డాక్టర్ రీతు కరిధాల్.. ‘రాకెట్ విమన్ ఆఫ్ ఇండియా’

HT Telugu Desk HT Telugu

14 July 2023, 14:08 IST

  • Chandrayaan-3: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రయోగం చంద్రయాన్ 3. భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రయోగం జులై 14 మధ్యాహ్నం 2. 35 గంటలకు జరగనుంది. అయితే, ఈ ప్రయోగం వెనుక ఉన్న కీలక శక్తి ఒక మహిళ. ఆమే రాకెట్ విమన్ ఆఫ్ ఇండియా గా పేరుగాంచిన డాక్టర్ రీతు కరిధాల్ (Dr Ritu Karidhal).

చంద్రయాన్ 3 ప్రాజెక్టును లీడ్ చేస్తున్న డాక్టర్ రీతు కరిధాల్ శ్రీ వాస్తవ
చంద్రయాన్ 3 ప్రాజెక్టును లీడ్ చేస్తున్న డాక్టర్ రీతు కరిధాల్ శ్రీ వాస్తవ

చంద్రయాన్ 3 ప్రాజెక్టును లీడ్ చేస్తున్న డాక్టర్ రీతు కరిధాల్ శ్రీ వాస్తవ

Chandrayaan-3: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రయోగం చంద్రయాన్ 3 (Chandrayaan-3). భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రయోగం జులై 14 మధ్యాహ్నం 2. 35 గంటలకు జరగనుంది. అయితే, ఈ ప్రయోగం వెనుక ఉన్న కీలక శక్తి ఒక మహిళ. ఆమే రాకెట్ విమన్ ఆఫ్ ఇండియా గా పేరుగాంచిన డాక్టర్ రీతు కరిధాల్ శ్రీ వాస్తవ (Dr Ritu Karidhal Srivastava).

rocket woman of India: రాకెట్ విమన్ ఆఫ్ ఇండియా..

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (Indian Space Research Organisation ISRO) లో డాక్టర్ రీతు కరిధాల్ సీనియర్ సైంటిస్ట్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రయాన్ 3 ప్రాజెక్టును ఆమెనే లీడ్ చేస్తున్నారు. డాక్టర్ రీతు కరిధాల్ (Dr Ritu Karidhal Srivastava) చంద్రయాన్ 2 (Chandrayaan-2) ప్రాజెక్టుకు మిషన్ డైరెక్టర్ గా వ్యవహరించారు. అలాగే,గురు గ్రహం పైకి స్పేస్ షిప్ ను పంపించడానికి ఉద్దేశించిన ‘మంగళ్ యాన్’ (Mangalyaan) ప్రాజెక్టుకు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆమె ఇస్రో వర్గాల్లో రాకెట్ విమన్ ఆఫ్ ఇండియా (rocket woman of India) గా పాపులర్.

Dr Ritu Karidhal Srivastava: డాక్టర్ అబ్దుల్ కలాం చేతుల మీదుగా..

డాక్టర్ రీతు కరిధాల్ శ్రీ వాస్తవ (Dr Ritu Karidhal Srivastava) ఉత్తర ప్రదేశ్ లోని లక్నో లో జన్మించారు. లక్నో యూనివర్సిటీలో బీఎస్సీ చదివారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నుంచి ఏరో స్పేస్ ఇంజనీరింగ్ లో ఎంఈ (ME degree in Aerospace Engineering) డిగ్రీ పొందారు. 1997 లో ఆమె ఇస్రోలో చేరారు. మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఆమె ‘ ఇస్రో యంగ్ సైంటిస్ట్’ అవార్డును పొందారు. మంగళయాన్ ప్రాజెక్టు కోసం చేసిన కృషికి గానూ.. ఆమె టీమ్ కు 2015 లో ఇస్రో టీమ్ అవార్డ్ లభించింది. 2017 లో విమన్ అచీవర్స్ ఇన్ ఏరోస్పేస్ పురస్కారాన్ని కూడా పొందారు. చిన్నప్పటి నుంచి అంతరిక్షమన్నా, ఆకాశంలోని నిగూఢ లోతులన్నా ఆమెకు అత్యంత ఆసక్తి. బాల్యం నుంచే ఇస్రో, నాసాకు సంబంధించిన వార్తలు ఉన్న పేపర్ కటింగ్స్ ను సేకరించి, భద్రపర్చుకునేవారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ లో ఆమె 20 కి పైగా పేపర్స్ ను పబ్లిష్ చేశారు.

Chandrayaan-3: చంద్రయాన్ 3

చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని పరిశోధించే నిమిత్తం చంద్రయాన్ 3 (Chandrayaan-3) ప్రయోగం చేపట్టారు. జులై 14, మధ్యాహ్నం 2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్ 3 ని ప్రయోగించనున్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ ప్రాజెక్టులో ఇది మూడో మిషన్. చంద్రయాన్ 1 విజయవంతమైంది. కానీ చంద్రయాన్ 2 చివరి దశలో ల్యాండింగ్ సమయంలో, చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలిపోయింది. చంద్రయాన్ 3 ని జీఎస్ఎల్వీ మార్క్ 3 (GSLV Mark 3) లాంచ్ వెహికిల్ తో ప్రయోగిస్తున్నారు.

తదుపరి వ్యాసం