తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Vauld Crypto Exchange : ‘క్రిప్టో’ పెట్టుబడిదారులకు భారీ షాక్​..

Vauld crypto exchange : ‘క్రిప్టో’ పెట్టుబడిదారులకు భారీ షాక్​..

Sharath Chitturi HT Telugu

04 July 2022, 19:13 IST

  • Vauld crypto exchange : క్రిప్టో పెట్టుబడిదారులకు భారీ షాక్​ తగిలింది. వాల్డ్​ క్రిప్టో ఎక్స్​ఛైంజీ.. తన విత్​డ్రాలు, డిపాజిట్లు, ట్రేడింగ్​ని నిలిపివేసింది.

‘క్రిప్టో’ పెట్టుబడిదారులకు భారీ షాక్​..
‘క్రిప్టో’ పెట్టుబడిదారులకు భారీ షాక్​.. (REUTERS)

‘క్రిప్టో’ పెట్టుబడిదారులకు భారీ షాక్​..

Vauld crypto exchange : దారుణంగా కరెక్ట్​ అవుతున్న పోర్ట్​ఫోలియోతో బెంబేలెత్తిపోతున్న క్రిప్టో కరెన్సీ పెట్టుబడిదారులకు మరో షాక్​ తగిలింది. సింగపూర్​కు చెందిన క్రిప్టోకరెన్సీ ఎక్స్​ఛైంజీ 'వాల్డ్​'.. ట్రేడింగ్​, డిపాజిట్లను పూర్తిగా నిలిపివేసింది. అంతేకాకుండా.. విత్​డ్రాలను కూడా నిలిపివేయడంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతున్నారు. వాల్డ్​ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికే అమల్లోకి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Fact Check: రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఎల్.కే.అడ్వాణీ ఈ వ్యాఖ్యలు చేయలేదు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

సంస్థను పునర్​నిర్మించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాల్డ్​ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ చర్యలతో ఆర్థిక, న్యాయపరమైన ప్రత్యర్థులతో పోటీ పడేందుకు మరింత శక్తి లభిస్తుందని ఆశిస్తున్నట్టు వెల్లడించింది. సంస్థ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వాల్డ్​ వెల్లడించింది.

భారీ పతనం..

క్రిప్టో మార్కెట్లకు గడ్డు కాలం నడుస్తోంది! ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ మార్కెట్లు దారుణంగా పతనమవుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా పేరొందిన బిట్​కాయిన్​.. ఆల్​టైమ్​ హై(69వేల డాలర్లు) నుంచి 70శాతం మేర పడిపోయింది.

వాల్డ్​ సంస్థను వాలర్​, పాంతేరా కాయిన్​బేస్​, సీఎంటీ డిజిటల్​ సంస్థలు నడిపిస్తున్నాయి. కాగా.. మోరటోరియం కోసం దరఖాస్తు చేసుకునేందుకు సింగపూర్​ కోర్టుకు వెళ్లాలని వాల్డ్​ ఆలోచిస్తోంది.

తదుపరి వ్యాసం