తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Fake Crypto Exchanges : రూ. 1000 కోట్లు దోచుకున్నారు.. ఘరానా స్కామ్

Fake Crypto exchanges : రూ. 1000 కోట్లు దోచుకున్నారు.. ఘరానా స్కామ్

HT Telugu Desk HT Telugu

21 June 2022, 15:09 IST

    • Fake crypto exchanges : అధిక రాబడుల ఆశచూపితే చాలు… బలైపోతున్నామన్న బెంగ లేకుండా డబ్బులు అప్పజెప్పేస్తారు. కేటుగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో వచ్చి గద్దల్లా తన్నుకుపోతారు. ఇదే కోవలో మరో స్కామ్ బయటపడింది.
నకిలీ క్రిప్టో ఎక్స్ఛేంజీలతో ముంచేస్తున్న కేటుగాళ్లు
నకిలీ క్రిప్టో ఎక్స్ఛేంజీలతో ముంచేస్తున్న కేటుగాళ్లు (REUTERS)

నకిలీ క్రిప్టో ఎక్స్ఛేంజీలతో ముంచేస్తున్న కేటుగాళ్లు

ఆరు నెలల కింది వరకు బిట్‌కాయిన్ తదితర క్రిప్టోకరెన్సీ మార్కెట్లో జోష్ ఉండేది. అయితే బిట్‌కాయిన్, ఈథర్ కాయిన్.. ఇలాంటి క్రిప్టో కరెన్సీల కొనుగోలు సామాన్యులకు కొరకరాని కొయ్యలా ఉండేది. ఇక్కడే వీరి బలహీనతను ఆసరా చేసుకుని అనేక యాప్స్ రంగంలోకి దిగాయి.

క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీ యాప్ అని, ఫారెక్స్ మార్కెట్ యాప్ అని, ఫారెక్స్ మార్కెట్ అని రకరకాల పేర్లు చెబుతూ కొంత మంది ఏజెంట్లను పెట్టుకుని అమాయకులకు వల విసురుతున్నార.

తనకు ఇప్పటికే రూ. 5 లక్షలు పెడితే రూ. 16 లక్షలు వచ్చాయని, కొద్ది మొత్తంలో పెడితే పెద్దగా లాభం ఉండదని ఊరిస్తూ ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో సహా దేశవ్యాప్తంగా వేలాది మంది ఈ ఫేక్ క్రిప్టో ఎక్స్ఛేంజీల బారిన పడి మోసపోతున్నారు. 

కాగా దేశవ్యాప్తంగా ఫేక్ క్రిప్టో ఎక్స్ఛేంజీల కారణంగా దేశవ్యాప్తంగా రూ. 1000 కోట్ల మేర అమాయకులు మోసపోయారని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో సైబర్ థ్రెట్స్‌ను అంచనా వేసే కంపెనీ క్లౌడ్ ఎస్ఈకే వెల్లడించినట్టు ది మింట్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది.

క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేయడం, అమ్మడం అంత సులువైన ప్రక్రియ కాదు. ఇదొక సంక్లిష్టమైన ప్రక్రియ. దీనికి నియంత్రణ వ్యవస్థ లేదు. నవంబరులో గరిష్టంగా 69 వేల డాలర్ల వరకు వెళ్లిన బిట్‌కాయిన్ రెండు రోజుల క్రితం 17 వేల డాలర్లకు పడిపోయిన సంగతి తెలిసిందే. అలాగే ఇతర ఆల్ట్ కాయిన్స్ పరిస్థితి కూడా ఇదే. మొత్తంగా క్రిప్టో కరెన్సీ మార్కెట్ దారుణంగా దెబ్బతిన్నది.

ఇక అసలు క్రిప్టో కరెన్సీ మార్కెట్ పరిస్థితి ఇదైతే.. ఇది ఆకర్షణీయంగా ఉందని చెప్పి దీనికి నకిలీ యాప్‌లు, నకిలీ ఎక్స్ఛేంజీలు సృష్టించి మోసగాళ్లు వంచిస్తున్నారు. వాస్తవానికి ఇండియాలో కూడా కొన్ని ఒరిజినల్ క్రిప్టో కరెన్సీ ఏజెన్సీలు ఉన్నాయి. కానీ కేటుగాళ్లు అమాయకులను వంచించి, వారు కష్టపడి దాచుకున్న సొమ్మును డిపాజిట్ చేయించుకుని యాప్ తిప్పేస్తున్నారు.

అయితే ఇప్పటివరకు ఇలాంటి మోసాలపై చాలా మంది తమ తమ కుటుంబాలకు భయపడి, ఇతరత్రా కారణాల వల్ల ఫిర్యాదులు చేయనట్టు తెలుస్తోంది.

ఇలాంటి నకిలీ క్రిప్టో ఎక్స్ఛేంజీల వల్ల ఇప్పటికే రూ. 1000 కోట్ల స్కామ్ జరిగిందని క్లౌడ్ ఎస్ఈకే అంచనా వేస్తోంది.

తదుపరి వ్యాసం