తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పదునైన కత్తితో ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన మహిళ..!

పదునైన కత్తితో ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన మహిళ..!

Sharath Chitturi HT Telugu

19 August 2022, 16:19 IST

    • UP crime news : ప్రియుడి మర్మాంగాన్ని.. ఓ మహిళ కోసేసిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగులోకి వచ్చింది. తన బిడ్డపై అతను అత్యాచారానికి యత్నించడమే ఇందుకు కారణం.
ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన మహిళ.. కూతురిపై చెయ్యి వేశాడని!
ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన మహిళ.. కూతురిపై చెయ్యి వేశాడని! (HT Telugu)

ప్రియుడి మర్మాంగాన్ని కోసేసిన మహిళ.. కూతురిపై చెయ్యి వేశాడని!

UP crime news : ఉత్తర్​ప్రదేశ్​లో.. ఓ మహిళ తన ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది. తన కూతురిపై అత్యాచార యత్నం చేసినందుకు అతడికి ఈ విధంగా బుద్ధిచెప్పింది.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

Indian students: భారతీయ విద్యార్థులకు ‘డీపోర్టేషన్’ ముప్పు; భారీగా నిరసనలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

ఇదీ జరిగింది..

భర్తకు మద్యం అలవాటు ఉండటంతో.. అతడిని విడిచిపెట్టేసింది ఓ మహిళ. అనంతరం తన ప్రియుడితో కలిసి లఖింపూర్​ ఖేరీలోని మహేవగంజ్​ ప్రాంతంలో రెండేళ్లుగా నివాసముంటోంది.

ఆ 36ఏళ్ల మహిళకు.. 14ఏళ్ల కూతురు ఉంది. కాగా.. ఆ బాలికపై.. ఆ మహిళ ప్రియుడి కన్ను పడింది.

ఆ 32ఏళ్ల వ్యక్తి.. బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అతడి మర్మాంగాన్ని కోసేసింది ఆ బాలిక తల్లి.

"ఈ ఘటన బుధవారం జరిగింది. నేను పొలం పని మీద బయటకు వెళ్లాను. కొద్ది సేపటికి ఇంటికి తిరిగొచ్చాను. సరిగ్గా అదే సమయానికి అతను నా బిడ్డను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. నేను అతడిని రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నాను," అని ఆ మహిళ వెల్లడించింది.

Woman cuts lover's penis : అత్యాచార యత్నాన్ని అడ్డుకుంది ఆ మహిళ. కొంపం పెంచుకున్న ఆ వ్యక్తి.. ఆమెను కొట్టేందుకు వెంబడించాడు. ఈ క్రమంలోనే.. అతడి నుంచి తప్పించుకుని వంటింట్లోకి వెళ్లిన మహిళ.. ఓ కత్తితో బయటకొచ్చింది. ఆ కత్తితోనే అతడి మర్మాంగాన్ని కోసేసింది. అతడు నొప్పితో విలవిలలాడాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లారు. అతడిని అరెస్ట్​ చేసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఈ ఏడాది మే నెలలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్​ తెనాలిలో.. తల్లి ప్రేమిస్తున్న వ్యక్తి మర్మాంగాన్ని ఓ మహిళ కోసేసింది. మరో ఘటనలో.. 27ఏళ్ల పొరుగింటి వ్యక్తి మర్మాంగాన్ని కత్తితో కోసేసింది ఈ 47ఏళ్ల మహిళ. అతను తనని వేధిస్తున్నట్టు చెప్పుకొచ్చింది.

తదుపరి వ్యాసం