తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  మాజీ ఎమ్మెల్యే ఆశ్రమానికి సమీపంలో మహిళ మృతదేహం.. చంపిందెవరు?

మాజీ ఎమ్మెల్యే ఆశ్రమానికి సమీపంలో మహిళ మృతదేహం.. చంపిందెవరు?

HT Telugu Desk HT Telugu

11 February 2022, 16:21 IST

  • Unnao Dalit woman case | ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​లో ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఆ మహిళ దాదాపు రెండు నెలల క్రితం అదృశ్యమైంది. ఈ ఘటన వెనక సమాజ్​వాదీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుమారుడి హస్తం ఉందని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. కాగా.. ఆ మాజీ ఎమ్మెల్యేకి చెందిన ఓ అశ్రమానికి సమీపంలోనే.. పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని వెలికితీశారు.

మాజీ ఎమ్మెల్యే ఆశ్రమానికి సమీపంలో మహిళ మృతదేహం
మాజీ ఎమ్మెల్యే ఆశ్రమానికి సమీపంలో మహిళ మృతదేహం (ht telugu)

మాజీ ఎమ్మెల్యే ఆశ్రమానికి సమీపంలో మహిళ మృతదేహం

Unnao crime news | ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​లో.. కొన్ని నెలల క్రితం అపహరణకు గురైన ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. సమాజ్​వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఫతేహ్​ బహదూర్​ సింగ్​కు చెందిన ఆశ్రమానికి సమీపంలో ఆ మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ వ్యవహారంలో ఆయన కుమారుడి హస్తం ఉందని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Israel-Hamas war: ఐరాసలో పాలస్తీనాకు అనుకూలంగా ఓటేసిన భారత్; నెగ్గిన ప్రతిపాదన

International Space Station: మే 14 వరకు ఈ సమయాల్లో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ను నేరుగా చూసే అవకాశం

Crime news : దారుణం.. తల్లి, భార్యను చంపి- పిల్లల్ని మేడ మీద నుంచి పడేసి.. చివరికి..!

Prajwal Revanna case : ప్రజ్వల్​ రేవన్నపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత అరెస్ట్​- మరో మహిళపై..

చంపిందెవరు?

డిసెంబర్​ 8న.. ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​కు చెందిన 22ఏళ్ల దళిత మహిళ అనూహ్యంగా అదృశ్యమైంది. ఆ తర్వాతి రోజు.. ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాజ్​వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఫతేహ్​ బహదూర్​ సింగ్​ కుమారుడు రాజోల్​ సింగ్​.. తన కుమార్తెను అపహరించాడని ఫిర్యాదులో పేర్కొంది.

నెల రోజులు గడిచినా.. కేసులో ఎలాంటి పురోగతి లభించలేదు. గత నెల 24న, ఎస్​పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​.. లఖ్​నవూ పర్యటనలో ఉండగా.. బాధితురాలి తల్లి ఆయన వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆయన ఎదుటే తన శరీరానికి నిప్పంటించుకునేందుకు ప్రయత్నించింది. తన కుమార్తెను అపహరించారని, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించింది.

Unnao case | ఈ ఘటన జరిగిన రోజే.. పోలీసులు రాజోల్​ను అరెస్ట్​ చేశారు. విచారణ అనంతరం.. ఫతేహ్​ బహదూర్​ గతంలో కట్టిన ఆశ్రమానికి సమీపంలో.. ఓ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. అది తన కుమార్తె మృతదేహమేనని ఆ తల్లి గుర్తించింది. 

మరోవైపు.. అక్రమ సంబంధం వ్యవహారమే ఈ పరిణామాలకు దారితీసిన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు.

"రాజోల్​ సింగ్​ను రిమాండ్​కు తరలించి విచారించాము. ఆ తర్వాత.. గురువారం నాడు మహిళ మృతదేహాన్ని వెలికితీశాము. ఆశ్రమానికి సమీపంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. స్థానిక నిఘా వ్యవస్థ ద్వారా ఘటనాస్థలాన్ని గుర్తించాము. అక్రమ సంబంధం వ్యవహారమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. విచారణ జరుగుతోంది. నేరస్థులను విడిచిపెట్టము. త్వరలోనే మిగిలినవారిని అరెస్ట్​ చేస్తాము," అని ఉన్నావ్​ అదనపు ఎస్​పీ శశి శేఖర్​ సింగ్​ మీడియాకు వెల్లడించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు పోలీసులు. కాగా మహిళపై దాడి జరిగిందని పోస్టుమార్టంలో తేలింది. అంతేకాకుండా ఆమె మెడను విరిచేశారాని, తలపై బలంగా కొట్టారని రిపోర్టులో స్పష్టమైంది.

రాజకీయ దుమారం..

ఎన్నికలు జరుగుతున్న ఉత్తర్​ప్రదేశ్​లో ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి దారితీసింది. ఎస్​పీపై బీఎస్​పీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఘటనకు పాల్పడిన వారిని విడిచిపెట్టకూడదని, బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని బీఎస్​పీ చీఫ్​ మాయావతి ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

"దళిత మహిళ మృతదేహాన్ని ఎస్​పీ నాయకుడి పొలాల్లో వెలికితీసిన ఘటన అత్యంత బాధాకరం, అత్యంత తీవ్రమైన విషయం. ఈ ఘటన వెనక ఎస్​పీ నాయకుడి హస్తం ఉందని బాధితురాలి కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. నిందితులను అరెస్ట్​ చేసి కఠినంగా శిక్షించాలి," అని మాయావతి ట్వీట్​ చేశారు.

తదుపరి వ్యాసం