తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Where Are Five, Six & Seven Billionth Babies?: 5, 6, 7 బిలియన్ బేబీస్ ఎక్కడ?

Where are five, six & seven billionth babies?: 5, 6, 7 బిలియన్ బేబీస్ ఎక్కడ?

HT Telugu Desk HT Telugu

15 November 2022, 16:11 IST

  • Where are five, six & seven billionth babies?: ప్రపంచ జనాభాపై అవగాహన పెంచడం కోసం, జనాభా లెక్కల ప్రాతిపదిక కోసం ప్రతీ వంద కోట్ల జనాభా పెరుగుదలను ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సందర్భంగా పరిగణిస్తుంది. తాజాగా, మంగళవారం, 2022, నవంబర్ 15న ఫిలిప్పైన్స్ లోని మనీలాలో 8వ బిలియన్ బేబీ(8 billionth baby) జన్మించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Where are five, six & seven billionth babies?: ప్రపంచ జనాభా 100 కోట్లు పెరిగిన ప్రతీ సందర్భాన్ని జనాభా పెరుగుదల నష్టాలు, సవాళ్లపై అవగాహన పెంచే అవకాశంగా యూఎన్ పరిగణిస్తుంది. అందులో భాగంగా ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా ఆ 100వ కోటి జననాన్ని ప్రత్యేకంగా నమోదు చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

CBSE Class 12 Result 2024: సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్ కు రిజిస్ట్రేషన్ ప్రారంభం

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

Where are five, six & seven billionth babies?: 1987లో క్రొయేషియాలో మాటెజ్ గాస్పర్..

5వ బిలియన్ బేబీ(5 billionth baby), అంటే ప్రపంచ జన సంఖ్యలో 500 కోట్ల నెంబర్ గల బేబీ 1987లో క్రొయేషియాలో జన్మించినట్లు యూఎన్ ప్రకటించింది. 1987, జులై 11న మాటెజ్ గాస్పర్(Matej Gaspar) అనే అబ్బాయి క్రొయేషియా రాజధాని జాగ్రెబ్లో 500 కోట్ల జనసంఖ్యగా(5 billionth baby) జన్మించాడు. యూఎన్ లెక్కల ప్రకారం ప్రపంచంలో అది 500 కోట్లవ జననం. ప్రస్తుతం ఆ మాటెజ్ గాస్పర్(Matej Gaspar) జాగ్రెబ్ లో కెమికల్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు.

Where are five, six & seven billionth babies?: 1999లో బోస్నియాలో అద్నాన్ మెవిక్

1999లో బోస్నియాలో 6వ బిలియన్(600 కోట్లవ జననం) బేబీగా అద్నాన్ మెవిక్ జన్మించాడు. బోస్నియా రాజధాని సరజేవోలో అక్టోబర్ 12, 1999న Adnan Mevic (6 billionth baby) గా జన్మించాడు. ఆ సమయంలో అప్పటి యూఎన్ ప్రధాన కార్యదర్శి కొఫీ అన్నన్ స్వయంగా అక్కడికి వెళ్లాడు. ఎకనమిక్స్ లో పీజీ చేసి, ప్రస్తుుతం నిరుద్యోగిగా ఉన్న అద్నాన్ త్వరలో ఉపాధి నిమిత్తం యూరోపియన్ యూనియన్ కి వెళ్లానని తెలిపాడు. 6వ బిలియన్ బేబీగా జన్మించడం వల్ల తన హీరో, ఫుట్ బాల్ స్టార్ రొనాల్డోను కలుసుకోగలిగానని తెలిపాడు.

Where are five, six & seven billionth babies?: 2011లో బంగ్లాదేశ్ లో సాదియా..

7వ బిలియన్ బేబీ బంగ్లాదేశ్ లో జన్మించింది. 2011లో ప్రపంచ జనాభాలో 700వ వ్యక్తిగా(7 billionth baby) జన్మించిన సాదియా ప్రస్తుతం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు దగ్గరలో నివసిస్తోంది. ఆమె డాక్టర్ కావాలని కోరుకుంటోంది. ఆమె కుటుంబం వస్త్రవ్యాపారంలో ఉంది.

Where are five, six & seven billionth babies?: 2080 నాటికి వంద కోట్లు

ప్రపంచ జనాభా పెరుగుదల రేటు కూడా 1950 ల నుంచి తగ్గుతూ వస్తోంది. 2020 సంవత్సరంలో ఇది అత్యల్పంగా, 1 శాతం కన్నా తక్కువగా నమోదైంది. ప్రపంచ జనాభా 1960లో 300 కోట్లకు, 1975లో 400 కోట్లకు, 1987లో 500 కోట్లకు, 1999లో 600 కోట్లకు, 2011లో 700 కోట్లకు చేరుకుంది. 2022లో 800 కోట్ల మైలురాయికి చేరుకున్న జనాభా.. 900 కోట్ల స్థాయికి చేరడానికి 15 సంవత్సరాలు పట్టవచ్చని ఐరాస అంచనా వేస్తోంది. అలాగే, 2080 నాటికి వంద కోట్ల జనాభా మార్క్ ను అందుకుంటుందని వెల్లడించింది.

తదుపరి వ్యాసం