UN says world population is 8 billion: ప్రతీ వంద కోట్ల జనాభా పెరుగుదల సమయంలో ఐక్య రాజ్య సమితి ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తుంది. గతంలో 500, 600, 700 కోట్లక ప్రపంచ జనాభా చేరిన సమయంలోనూ యూఎన్ ప్రత్యేక ప్రకటనలు విడుదల చేసింది. ఆ ‘బిలియన్ బేబీ’ల వివరాలు ఇవిగో..
ప్రపంచ జనాభా(population) 700 కోట్ల నుంచి 800 కోట్లకు(8 billion) చేరడానికి పట్టిన సమయం ఎంతో తెలుసా? కేవలం 12 సంవత్సరాలు. ప్రపంచ జనాభా 2011లో 700 కోట్ల మైలు రాయికి చేరుకోగా, 12 ఏళ్ల తరువాత 2022లో 800 కోట్ల మార్క్ ను అందుకుంది. ఈ జనాభా(population) పెరుగుదలలో భారత్ గణనీయ పాత్ర పోషించింది. అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న దేశాల్లే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉందని ఒక అధ్యయనంలో తేలింది.
2011 నుంచి 2022 మధ్య 700 కోట్ల నుంచి 800 కోట్లకు(8 billion) పెరిగిన జనాభా(population)లో అత్యధిక శాతం భారత్ లో జన్మించిన వారే. ఈ విషయంలో భారత్ చైనాను రెండో స్థానంలోకి నెట్టేసింది. కాగా, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనా, ఆ తరువాత స్థానంలో భారత్ ఉన్న విషయం తెలిసిందే. అయితే, త్వరలో ఈ రెండు అగ్ర స్థానాలు తారుమారవనున్నాయి. అత్యధిక జనాభా ఉన్న దేశంగా 2023 లోనే భారత్ అవతరించబోతోంది. చైనా కట్టుదిట్టంగా చేపట్టిన జనభా నియంత్రణ పద్ధతుల వల్ల ప్రస్తుతం అక్కడ జనాభా వృద్ధి రేటు నెగటివ్ గా నమోదవుతోంది. కాగా, భారత్ జనాభా(population) 2050 నాటికి 170 కోట్లు చేరుతుందని, అదే సమయంలో చైనా జనాభా 130 కోట్లకు తగ్గుతుందని అంచనా.