తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Boris Johnson : వైదొలగనంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

Boris Johnson : వైదొలగనంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

HT Telugu Desk HT Telugu

07 July 2022, 10:23 IST

    • బ్రిటన్ కేబినెట్ మంత్రులు, మంత్రులు, సహాయకుల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. కానీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మాత్రం తన పదవి నుంచి వైదొలగడం లేదు.
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్
బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (REUTERS)

బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్

బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన పదవిని అంటిపెట్టుకునే ఉన్నాయి. ముగ్గురు కేబినెట్ సభ్యులు సహా 40 మంత్రులు, సహాయకులు వైదొలిగినప్పటికీ పదవి నుంచి దిగిపోయేందుకు నిరాకరిస్తున్నారు.

ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ బుధవారం తన కేబినెట్ సహచరుల నుంచి ప్రశ్నల వర్షం ఎదుర్కొన్నారు. వైదొలగాల్సిన సమయం ఆసన్నమైందని వారంతా చెప్పినట్టు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

ఆర్థిక మంత్రి రిషి సునక్, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్ మంగళవారం రాత్రి రాజీనామాలు చేసింది మొదలు మంత్రుల రాజీనామ పర్వం కొనసాగుతూనే ఉంది.

సీనియర్ కన్జర్వేటివ్ ఎంపీ క్రిస్ పించర్‌ను డిప్యూటీ చీఫ్ విప్‌గా నియమించడంపై బోరిస్ జాన్సన్ క్షమాపణ చెప్పిన వెంటనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. క్రిస్ పించర్ తాగి ఇద్దరు పురుషులను లైంగిక వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఆయనను డిప్యూటీ చీఫ్ విప్ పదవిలో నియమించడంపై బోరిస్ జాన్సన్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ పై క్రిస్ పించర్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

తన క్యాబినెట్ సహచరుల నుంచి బోరిస్ జాన్సన్ తన సహచర కేబినెట్ మంత్రులు, పార్లమెంట్ కమిటీ సభ్యుల నుంచి బుధవారం ప్రశ్నల వర్షాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

రిషి సునక్, జావిద్‌ల బాటలోనే జాన్సన్ కేబినెట్ నుంచి సైమన్ హార్ట్ బుధవారం వైదొలిగారు. చివరకు బుధవారం రాత్రి ఆరోగ్య మంత్రితో సహా కనీసం 44 మంది మంత్రులు, సహాయకులు రాజీనామా చేశారు. ఇందులో ఎక్కువ మంది జూనియర్ పొజిషన్స్‌లో ఉన్నారు. వారంత కేబినెట్‌లో భాగం కాదు.

బోరిస్ జాన్సన్ ఇతర వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. లాక్‌డౌన్ నియమాలు ఉల్లంఘించడం వంటి సమస్యలు తెచ్చి పెట్టుకున్నాడు. పార్టీ గేట్‌గా పిలుచుకునే ఈ వ్యవహారంలో ప్రధాన మంత్రి పోలీస్ జరిమానా ఎదుర్కొన్నారు. దీనిపై పార్లమెంటరీ కమిటీ విచారణ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. బోరిస్ జాన్సన్ అవిశ్వాస తీర్మానం నుంచి నెలరోజుల క్రితమే తృటిలో గట్టెక్కారు.

తదుపరి వ్యాసం