తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Houthi Attack: ఎర్ర సముద్రంలో యూకే షిప్ లో మంటలు; నౌకలో 22 మంది భారతీయులు; హౌతీ దాడిగా అనుమానం

Houthi attack: ఎర్ర సముద్రంలో యూకే షిప్ లో మంటలు; నౌకలో 22 మంది భారతీయులు; హౌతీ దాడిగా అనుమానం

HT Telugu Desk HT Telugu

27 January 2024, 17:50 IST

    • Houthi attack: ఎర్ర సముద్రంలో యూకే కు చెందిన ఒక వాణిజ్య నౌకకు మంటలు అంటుకున్నాయి. హౌతీ దాడి వల్లనే ఆ నౌకకు మంటలంటుకున్నట్లు భావిస్తున్నారు. సహాయం అవసరమంటూ ఆ నౌక నుంచి వచ్చిన సందేశంపై భారత నౌకాదళానికి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ ఎస్ విశాఖపట్నం స్పందించింది.
ఎర్ర సముద్రంలో మంటల్లో ఎంవీ మెర్లిన్ లువాండా వాణిజ్య నౌక
ఎర్ర సముద్రంలో మంటల్లో ఎంవీ మెర్లిన్ లువాండా వాణిజ్య నౌక

ఎర్ర సముద్రంలో మంటల్లో ఎంవీ మెర్లిన్ లువాండా వాణిజ్య నౌక

ఎర్ర సముద్రంలో యెమెన్ తీరంలో ఉన్న యూకేకు చెందిన ఎంవీ మెర్లిన్ లువాండా అనే చమురు వాణిజ్య నౌకకు జనవరి 26, శుక్రవారం రాత్రి మంటలు అంటుకున్నాయి. ఆ నౌక నుంచి వచ్చిన ఎమర్జెన్సీ సందేశంపై భారత నౌకాదళానికి చెందిన, గల్ఫ్ ఆఫ్ అడెన్ లో ఉన్న ఐఎన్ఎస్ విశాఖపట్నం వెంటనే స్పందించింది.

భారతీయులు

యూకేకు చెందిన ఎంవీ మెర్లిన్ లువాండా అనే ఆ వాణిజ్య నౌక లో 22 మంది భారతీయ సిబ్బంది, ఒక బంగ్లాదేశీ ఉన్నారని భారత నౌకాదళం తెలిపింది. వాణిజ్య నౌక మెర్లిన్ లువాండా పై హౌతీ తిరుగుబాటుదారులు యాంటీ షిప్ క్షిపణి తో దాడి చేసినట్లు భావిస్తున్నారు. ఆ దాడి కారణంగా చమురు నౌకకు మంటలు అంటుకుని, పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఆయిల్ ట్యాంకర్ లో మంటలు చెలరేగినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.

భారత్, అమెరికా స్పందన

చమురు రవాణా చేస్తున్న ఎంవీ మెర్లిన్ లువాండా వాణిజ్య నౌకపై హౌతీ దాడితో ఆ నౌకకు మంటలంటుకున్నాయి. వెంటనే, ఎంవి మెర్లిన్ లువాండా సిబ్బంది గల్ఫ్ ఆఫ్ అడెన్ లో ఉన్న భారత నౌకాదళానికి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం కు సమాచారమిచ్చారు. దాంతో, ఐఎన్ఎస్ విశాఖపట్నం వెంటనే అవసరమైన సామగ్రితో ఎంవీ మెర్లిన్ లువాండా వద్దకు వెళ్లింది. మార్లిన్ లువాండాను హౌతీ యాంటీ షిప్ క్షిపణి ఢీకొట్టిన తర్వాత అమెరికా నావికాదళ నౌక, ఇతర నౌకలు సహాయం అందిస్తున్నాయని అమెరికా సైన్యం ఇంతకు ముందు తెలిపింది.

తదుపరి వ్యాసం