తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Uk Family Visa: యూకే ఫ్యామిలీ వీసా వేతన పరిమితి పెంపు

UK Family Visa: యూకే ఫ్యామిలీ వీసా వేతన పరిమితి పెంపు

HT Telugu Desk HT Telugu

22 December 2023, 20:38 IST

  • UK Family Visa: ఫ్యామిలీ వీసాలకు సంబంధించి బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ వీసా వేతన పరిమితిని దశలవారీగా 38,700 పౌండ్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Reuters)

ప్రతీకాత్మక చిత్రం

UK Family Visa: ఫ్యామిలీ వీసాపై జీవిత భాగస్వామిని స్పాన్సర్ చేయడానికి అర్హత కలిగిన శాశ్వత నివాసితులకు .. వారి కనీస వార్షిక వేతన పరిమితిని పెంచే దిశగా యూకే చర్యలు తీసుకుంటోంది. ఈ వార్షిక వేతన పరిమితి ప్రస్తుతం 18,600 పౌండ్లు ఉండగా, మొదటి దశలో ఈ పరిమితిని 29,000 పౌండ్లకు పెంచనున్నారు. ఆ తరువాత రెండు దశల్లో ఈ పరిమితిని 38,700 పౌండ్లకు తీసుకువెళ్తారు.

మూడు దశల్లో 39 వేల పౌండ్లకు..

‘‘ఫ్యామిలీ వీసాపై జీవిత భాగస్వామిని స్పాన్సర్ చేయడానికి మొదటి దశలో వార్షిక వేతన పరిమితిని 29 వేల పౌండ్లకు పెంచుతున్నాం. ఇది ఇది స్కిల్డ్ వర్కర్ వీసాలకు అర్హత కలిగిన ఉద్యోగాలకు లభించే సంపాదనలో 25 వ శాతంగా ఉంటుంది’’ అని హోం శాఖ మంత్రి లార్డ్ ఆండ్రూ షార్ప్ తెలిపారు. తరువాతి దశల్లో మొదట వార్షిక వేతన పరిమితిని స్కిల్డ్ వర్కర్ వీసాలకు అర్హత కలిగిన ఉద్యోగాలకు లభించే సంపాదనలో 40 శాతానికి, ఆ తరువాత స్కిల్డ్ వర్కర్ వీసాలకు అర్హత కలిగిన ఉద్యోగాలకు లభించే సంపాదనలో 50 శాతానికి పెంచుతామని వెల్లడించారు. కుటుంబ ఖర్చులకు ఇతర పన్ను చెల్లింపుదారులపై ఆధారపడడాన్ని బ్రిటన్ ప్రభుత్వం ప్రోత్సహించబోదని స్పష్టం చేశారు. విద్యార్థులపై ఆధారపడిన వారికి సంబంధించినవి మినహా.. మిగతా మార్పులు 2024, ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయి.

తదుపరి వ్యాసం