తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ugc Net June 2023: యూజీసీ నెట్ జూన్ ఫేజ్ 1 పరీక్షల తేదీలు ఇవే..

UGC NET June 2023: యూజీసీ నెట్ జూన్ ఫేజ్ 1 పరీక్షల తేదీలు ఇవే..

HT Telugu Desk HT Telugu

08 June 2023, 14:55 IST

    • జూన్ నెలలో జరిగే యూజీసీ నెట్  ఫేజ్ 1 పరీక్షలకు సంబంధించిన తేదీలను ఎన్టీఏ ప్రకటించింది. విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ nta.ac.in. ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Agencies/file)

ప్రతీకాత్మక చిత్రం

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) ఫేజ్ 1 పరీక్షలు జూన్ నెలలో జరగనున్నాయి. ఈ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. ఆ పరీక్షల తేదీలను గురువారం ఎన్టీఏ వెల్లడించింది.ఆ పరీక్షల షెడ్యూల్ ను ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్స్ nta.ac.in., https://ugcnet.nta.nic.in, www.nta.ac.in లో అప్ లోడ్ చేశారు.

జూన్ 13 నుంచి జూన్ 22 వరకు..

యూజీసీ నెట్ 2023 ఫేజ్1 పరీక్షలు వివిధ సబ్జెక్టులకు జూన్ 13 నుంచి జూన్ 22 వరకు జరగనున్నాయి. రెండు షిఫ్ట్ ల్లో ఈ పరీక్ష జరుగుతుంది. ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలను గురువారం ఎన్టీఏ ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన పరీక్ష తేదీలకు సంబంధించినది మాత్రమేనని, ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ ను త్వరలో https://ugcnet.nta.nic.in, www.nta.ac.in వెబ్ సైట్స్ లో అప్ లోడ్ చేస్తామని, అడ్మిట్ కార్డ్స్ ను జూన్ 10 లోగా అప్ లోడ్ చేస్తామని వివరించింది. ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించాలని కోరింది. యూజీసీ నెట్ 2023 కి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 10 న ప్రారంభమై, మే 31వ తేదీన ముగిసింది. కరెక్షన్ విండో జూన్ 2, జూన్ 3 తేదీల్లో ఓపెన్ అయింది.

టాపిక్

తదుపరి వ్యాసం