తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Assistant Professor Posts: ‘అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కు ఈ అర్హత తప్పని సరి’: యూజీసీ

Assistant Professor posts: ‘అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కు ఈ అర్హత తప్పని సరి’: యూజీసీ

HT Telugu Desk HT Telugu

05 July 2023, 12:09 IST

  • దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ (Assistant Professor) ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక సవరణ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్ట్ ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కీలక సవరణ చేసింది. 2023 జులై నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ల డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు కనీసం నెట్ (NET) లేదా సెట్ (SET), లేదా స్లెట్ (SLET) లో అర్హత సాధించి ఉండాలని స్పష్టం చేసింది. పీహెచ్డీ (Ph.D.) డిగ్రీ కలిగి ఉండాల్సిన అవసరం లేదని, అది ఆప్షనల్ మాత్రమేనని వివరణ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Southest Monsoon : గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

CBSE Class 10 results : సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

నెట్, సెట్, స్లెట్

ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ లకు అర్హత కలిగించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (National Eligibility Test NET), స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (State Eligibility Test SET), స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (State Level Eligibility Test SLET) ల విషయంలో యూజీసీ స్పష్టతనిచ్చింది. ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ లకు కనీసం నెట్, సెట్, లేదా స్లెట్ లలో.. ఏ ఒక్క పరీక్షలోనైనా ఉత్తీర్ణత సాధించి ఉండాలని స్పష్టం చేసింది. పీహెచ్డీ (Ph.D.) కలిగి ఉండడం ఈ పోస్ట్ ల విషయంలో ఆప్షనల్ మాత్రమేనని నిర్ధారించింది.

నిబంధనల్లో మార్పులు

ఈ మేరకు యూజీసీ గెజెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. యూనివర్సిటీలు, కాలేజీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు అప్లై చేసుకునే వ్యక్తి కనీసం నెట్ లేదా సెట్ లేదా స్లెట్ లో ఉత్తీర్ణుడై ఉండాలని ఆ నోటిఫికేషన్ లో యూజీసీ స్పష్టంగా పేర్కొంది. ఈ పోస్ట్ లకు పీహెచ్డీ కలిగి ఉండడం జులై 1, 2023 నుంచి ఐచ్ఛికమేనని తెలిపింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ (Assistant Professor) పోస్ట్ లకు పీహెచ్ డీ (Ph.D.) డిగ్రీ అవసరం లేదని 2021లోనే యూజీసీ ఒక ప్రకటన చేసింది.

తదుపరి వ్యాసం