తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ufo At Imphal Airport : మణిపూర్​లో ‘యూఎఫ్​ఓ’ కలకలం.. రంగంలోకి దిగిన రఫేల్​ జెట్స్​!

UFO at Imphal airport : మణిపూర్​లో ‘యూఎఫ్​ఓ’ కలకలం.. రంగంలోకి దిగిన రఫేల్​ జెట్స్​!

Sharath Chitturi HT Telugu

20 November 2023, 13:45 IST

    • UFO at Imphal airport : మణిపూర్​లో యూఎఫ్​ఓ కలకలం సృష్టించింది! ఇంఫాల్​ విమానాశ్రయానికి సమీపంలో యూఎఫ్​ఓ కనిపించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తేల్చేందుకు.. రఫేల్​ జెట్స్​ కూడా రంగంలోకి దిగాయట!
మణిపూర్​లో ‘యూఎఫ్​ఓ’ కలకలం.. రంగంలోకి దిగిన రఫేల్​ జెట్స్​!
మణిపూర్​లో ‘యూఎఫ్​ఓ’ కలకలం.. రంగంలోకి దిగిన రఫేల్​ జెట్స్​! (Representative image)

మణిపూర్​లో ‘యూఎఫ్​ఓ’ కలకలం.. రంగంలోకి దిగిన రఫేల్​ జెట్స్​!

UFO at Imphal airport : యూఎఫ్​ఓ (అన్​ఐడెంటిఫైడ్​ ఫ్లైయింగ్​ ఆబ్జెక్ట్​) కనిపించిందన్న వార్తలు.. అమెరికాలో ఎక్కువగా విపిస్తుంటాయి. అయితే.. ఇలాంటి వార్తే ఒకటి ఇండియాలో వెలుగులోకి వచ్చింది! మణిపూర్​లో ఓ యూఎఫ్​ఓ కనిపించిందట. అసలేం జరిగిందనేది తెలుసుకోవడానికి.. రెండు రఫేల్​ ఫైటర్​ జెట్స్​ని.. ఆర్మీ ఆ ప్రాంతానికి పంపించిందట!

ట్రెండింగ్ వార్తలు

Southest Monsoon : గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

CBSE Class 10 results : సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

CBSE class 12 results 2024 : సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

ఇదీ జరిగింది..

మణిపూర్​ రాజధాని ఇంఫాల్​ ఎయిర్​పోర్ట్​కు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఒక యూఎఫ్​ఓ కనిపించిందని వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ ఘటన.. పలు కమర్షియల్​ ఫ్లైట్స్​ రాకపోకలకు ఇబ్బంది కలిగించింది. కొంతసేపటి తర్వాత.. విమానాల కార్యకలాపాలు యథాతథంగా కొనసాగాయి.

UFO sighted in Manipur : కాగా.. మణిపూర్​లో యూఎఫ్​ఓ కనిపించిందన్న వార్తతో.. అక్కడికి సమీపంలోని ఓ ఎయిర్​బేస్​ నుంచి రెండు రఫేల్​ విమానాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

"యూఎఫ్​ఓ కనిపించిందని మాకు సమాచారం వచ్చింది. దానిని కనుగొనేందుకు.. రెండు రఫేల్​ విమానాలను వెంటనే పంపించాము," అని ఓ డిఫెన్స్​ అధికారి.. మీడియాకు చెప్పినట్టు సమాచారం.

"రఫేల్​లో అడ్వాన్స్​డ్​ సెన్సార్​లు ఉన్నాయి. యూఎఫ్​ఓలు కనిపించాయని చెబుతున్న ప్రాంతంలో.. రఫేల్​ విమానాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ అక్కడ వాటికి ఏం కనిపించలేదు," అని ఆ డిఫెన్స్​ అధికారు వెల్లడించారు.

UFO in India news : "వీడియోలో కనిపిస్తున్న యూఎఫ్​ఓ ఆచూకీని తెలుసుకునేందుకు సంబంధిత విభాగాలు కృషిచేస్తున్నాయి," అని ఆ అధికార వివరించారు.

తాజా పరిణామాల మధ్య ఒక కీలక ప్రకటన చేసింది భారత వాయుసేనకు చెందిన ఈస్టెర్న్​ కమాండ్​.

"ఇంఫాల్​ విమానాశ్రయం నుంచి అందిన విజువల్​ ఇన్​పుట్స్​ ఆధారంగా.. ఎయిర్​ డిఫెన్స్​ రెస్పాన్స్​ సిస్టెమ్​ని యాక్టివేట్​ చేశాము. ఆ తర్వాత.. యూఎఫ్​ఓగా చెబుతున్న ఆ చిన్న పరికరం.. కనిపించలేదు," అని ట్వీట్​ చేసింది ఈస్టెర్న్​ కమాండ్​.

UFO Rafale jets : యూఎఫ్​లో ఎలియెన్స్​ (గ్రహాంతరవాసులు) ఉంటాయని భావిస్తుంటారు. ఇక ఇంఫాల్​ విమానాశ్రయానికి సమీపంలో కనిపించిన ఆబ్జెక్ట్​.. నిజంగా యూఎఫ్​ఓనేనా? అందులో ఏలియన్స్​ ఉన్నాయా? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఈ తరహా వార్తలు ఎప్పుడు వినిపించినా.. సమాధానాలు పెద్దగా తెలియవు. అవి మిస్టరీగానే మిగిలిపోతాయి!

తదుపరి వ్యాసం