తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Tripura Polls: త్రిపురలో లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ మధ్య సీట్ల ఒప్పందం

Tripura polls: త్రిపురలో లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ మధ్య సీట్ల ఒప్పందం

HT Telugu Desk HT Telugu

02 February 2023, 18:40 IST

  • ఫిబ్రవరి 16న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త్రిపుర (Tripura polls) లో ఎట్టకేలకు విపక్ష కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ ల మధ్య సీట్ల పంపకానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అధికారంలో ఉన్న బీజేపీని ఓడించడానికి త్రిపుర (Tripura polls)లో కాంగ్రెస్ (congress), సీపీఎం (CPM) నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ జట్టు కట్టాయి. సుదీర్ఘ చర్చల అనంతరం నామినేషన్ల ఉపసంహరణకు ఒక రోజు ముందు ఆ పార్టీల మధ్య సీట్ల పంపకానికి సంబంధించి ఒప్పందం కుదిరింది.

ట్రెండింగ్ వార్తలు

JEE Advanced Admit Card : జేఈఈ అడ్వాన్స్​డ్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

Tripura assembly polls: మొత్తం 60 స్థానాలు

త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ (Tripura assembly polls) స్థానాలున్నాయి. రాష్ట్రంలో ఫిబ్రవరి 16న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం త్రిపురలో బీజేపీ (BJP) అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో (Tripura assembly polls) విజయం సాధించి బీజేపీ (BJP) ఇక్కడ తొలిసారి అధికారంలోకి వచ్చింది. అంతకుముందు సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ దాదాపు 2 దశాబ్దాల పాటు ఇక్కడ అధికారంలో ఉంది.

Tripura assembly polls: ఎవరికెన్ని సీట్లు..

ఫిబ్రవరి 16న త్రిపుర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి సంబంధించి కాంగ్రెస్ (congress), లెఫ్ట్ ఫ్రంట్ ల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. మొత్తం 60 సీట్లకు గానూ 47 సీట్లలో లెఫ్ట్ ఫ్రంట్ (left front), 13 సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. లెఫ్ట్ ఫ్రంట్ కు కేటాయించిన 47 సీట్లలో సీపీఎం (CPM) 43 స్థానాల్లో, సీపీఐ, ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఒక ఇండిపెండెంట్ ఒక్కో సీట్ లో పోటీ చేస్తారు. అదనపు స్థానాల్లో నామినేషన్ వేసిన ఆయా పార్టీల అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకుంటారు. కాగా, బీజేపీయేతర కూటమిలో చేరడానికి TIPRA Motha అంగీకారం తెలపలేదు. తమ ప్రధాన డిమాండ్ అయిన గ్రేటర్ త్రిపురల్యాండ్ కు ఆమోదం తెలుపుతూ లిఖితపూర్వక హామీ ఇస్తేనే పొత్తు పెట్టుకుంటామని స్పష్టం చేసింది.

తదుపరి వ్యాసం