Tripura elections 2023 : కొత్త పార్టీ ఎంట్రీతో.. త్రిపురలో బీజేపీకి చిక్కులు!-tripura elections 2023 entry of third player adds a new dynamic ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Tripura Elections 2023 : కొత్త పార్టీ ఎంట్రీతో.. త్రిపురలో బీజేపీకి చిక్కులు!

Tripura elections 2023 : కొత్త పార్టీ ఎంట్రీతో.. త్రిపురలో బీజేపీకి చిక్కులు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 22, 2023 05:35 PM IST

Tripura elections 2023 : ప్రత్యేక టిప్రాల్యాండ్​ డిమాండ్​తో టిప్రా మోతా పార్టీని ఏర్పాటు చేశారు కాంగ్రెస్​ పార్టీ మాజీ నేత దేవ్​ బర్మ. త్రిపురలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ పార్టీ వార్తల్లో నిలిచింది. ఈ కొత్త పార్టీతో బీజేపీకి కొత్త చిక్కులు తప్పవా?

కొత్త పార్టీ ఎంట్రీతో త్రిపురలో బీజేపీకి చిక్కులు!
కొత్త పార్టీ ఎంట్రీతో త్రిపురలో బీజేపీకి చిక్కులు! (HT_PRINT)

Tripura elections 2023 : త్రిపురలో ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. ప్రజలను ఆకర్షించేందుకు పార్టీలన్నీ తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఈక్రమంలో అధికార బీజేపీని ఓడించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. బద్ధ శత్రువులగా ఉండే కాంగ్రెస్​, వామపక్షాలు కలిసిపోయాయి. బీజేపీకి ఇదొక చిక్కు అయితే.. వీటి మధ్య ఈ దఫా ఎన్నికల్లో కొత్త పార్టీ పోటీచేస్తుండటం మరో సమస్య! అదే.. కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రద్యుత్​ బిక్రమ్​ మానిక్య దేబ్​ బర్మ స్థాపించిన టిప్రా మోతా పార్టీ.

కొత్త పార్టీ ఎంట్రీతో..

రాష్ట్రంలోని ఆదివాసీ బృందాల హక్కుల రక్షణ కోసం టిప్రా మోతా పార్టీని స్థాపించారు దేబ్​ బర్మ. వీరి కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, దానికి టిప్రాల్యాండ్​ అని పేరు పెట్టాలని గత కొన్నేళ్లుగా డిమాండ్​ చేస్తున్నారు దేబ్​ బర్మ. తమ డిమాండ్​ల పరిష్కారానికి లిఖితపూర్వక లేఖ అందించే పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటామని ఆయన ఇప్పటికే ప్రకటించారు.

TIPRA Motha party : "నేతల మాటలపై నాకు నమ్మకం లేదు. టిప్రాల్యాండ్​ ఏర్పాటుకు లిఖితపూర్వక లేఖ అందించిన పార్టీతో పొత్తు కుదుర్చుకుటాము. ఈ విషయంలో అసలు రాజీపడే అవకశం లేదు," అని దేబ్​ బర్మ స్పష్టం చేశారు.

కొండ ప్రాంతాల్లో నివాసముండే ఈ ఆదీవాసీ బృందాలకు.. రాష్ట్రంలోని 60 సీట్లల్లో 20 నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. వీరి మద్దతు తమ పార్టీ ఉంటుందని దేబ్​ బర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సమయంలో.. ఐపీఎఫ్​టీ (ఇండీజీనియస్​ పీపుల్స్​ ఫ్రంట్​ ఆఫ్​ త్రిపుర) అనే పార్టీతోనూ దేబ్​ బర్మ టచ్​లో ఉన్నారు. 2018 ఎన్నికల్లో 9 సీట్లల్లో పోటీ చేసిన ఈ పార్టీ.. 8 స్థానాల్లో గెలిచింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో ఓ భాగంగా ఉంది. ఈ పార్టీని తమలో కలుపుకోవాలని దేబ్​ బర్మ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గత మూడు నెలల వ్యవధిలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు.. ఐపీఎఫ్​టీ నుంచి టిప్రా మోతా పార్టీకి వలస వెళ్లిపోయారు. అనేక మంది కార్యకర్తలు సైతం.. పార్టీ జెండాను మార్చేశారు. మెర్జర్​కు ఐపీఎఫ్​టీ కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. "టిప్రాల్యాండ్​ కోసం కృషి చేస్తున్న దేబ్​ బర్మ పార్టీలతో కలుస్తాము," అని ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ ప్రేమ్​ కుమార రియంగ్​ చెప్పడం గమనార్హం.

బీజేపీ కష్టాలు తప్పవా..?

TIPRA Motha party Bikram Manikya Deb Barma : త్రిపురలో వామపక్షాలు రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నాయి. 2018 ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన బీజేపీ.. ఇతర పార్టీల మద్దతుతో తొలిసారిగా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాటి ఎన్నికల్లో బీజేపీ 36 సీట్లల్లో విజయం సాధించగా.. వామపక్షానికి 16 స్థానాలే దక్కాయి. కాంగ్రెస్​ ఖాతా తెరవలేదు.

ఎన్ని పార్టీలు వచ్చినా.. ఎన్ని పార్టీలు పొత్తు కుదుర్చుకున్నా.. 2023లో విజయం తమనే వరిస్తుందని బీజేపీ ధీమాగా ఉంది. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంతో పాటు త్రిపుర అభివృద్ధి కూడా పరుగులు పెడుతోందని చెబుతూ.. కమలదళం ఓటర్ల ముందుకు వెళుతోంది.

TIPRA Motha party news : "రాష్ట్రంలో జరిగిన అసాధారణ అభివృద్ధి, కేంద్రంలో మోదీ నేతృత్వంలోని డబుల్​ ఇంజిన్​ సర్కార్​ ఘనతలే మా అజెండా. ప్రజలు మాకే ఓట్లు వేస్తారు," అని త్రిపుర సీఎం మానిక్​ సాహా అన్నారు. 2022లో బిప్లబ్​ కుమార్​ దేవ్​ను తప్పించి.. సీఎం పదవిలో మానిక్​ సాహాను కూర్చొపెట్టింది బీజేపీ అధిష్ఠానం.

విపక్షాల వాదన మాత్రం మరోలా ఉంది. రెండోసారి అధికారంపై బీజేపీ కలలు కంటోందని ఎద్దేవే చేస్తున్నాయి. ఐగేళ్లల్లో అభివృద్ధి లేదని, హింస మాత్రం పెరిగిపోయిందని మండిపడుతున్నాయి. నిరుద్యోగం వంటి సమస్యలు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని, బీజేపీ పూర్తి విఫలమైందని విమర్శిస్తున్నాయి.

పెరిగిన హింస..!

Tripura election schedule : ఐదేళ్లల్లో త్రిపురలో 'రాజకీయ' హింస కూడా పెరిగింది! విపక్షాల నేతలపై దాడులు పెరిగాయి. ఈ తరహా ఘటనలతో.. రాష్ట్రంలో గత ఐదేళ్లల్లో 700కుపైగా కేసులు నమోదుకావడం గమనార్హం.

అయితే ఈ ధఫా ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్ష అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

"బీజేపీకి ఈ దఫా ఎన్నికలు పరీక్షనే చెప్పుకోవాలి. మోదీకి ఉన్న ప్రజాదారణ చూసి.. గతంలో ప్రజలు ఓట్లేశారు. పార్టీపై భారీ అంచనాలతో ఓట్లు వేశారు. ఐదేళ్లు గడిచింది. బీజేపీ పాలనపై ప్రజలు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి," అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎస్​ భట్టాచార్య అభిప్రాయపడ్డారు.

Tripura elections dates : త్రిపురలో 60 సీట్లకు ఫిబ్రవరి 16న ఎన్నికలు జరగనున్నాయి. మార్చ్​ 2న ఫలితాలు వెలువడనున్నాయి. మరి దేవ్​ బర్మ నేతృత్వంలోని టిప్రా మోతా పార్టీ.. ఏమేరకు ప్రభావం చూపిస్తుందే వేచి చూడాలి.

IPL_Entry_Point

సంబంధిత కథనం