తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Solar Eclipse 2024 : సంపూర్ణ సూర్య గ్రహణాన్ని ఆదిత్య ఎల్​1 చూడలేదు.. కారణం ఇదే!

Solar eclipse 2024 : సంపూర్ణ సూర్య గ్రహణాన్ని ఆదిత్య ఎల్​1 చూడలేదు.. కారణం ఇదే!

Sharath Chitturi HT Telugu

08 April 2024, 11:15 IST

  • Total solar eclipse 8 April : ఏప్రిల్​ 8న సంభవించే సంపూర్ణ సూర్య గ్రహణాన్ని, భారత దేశ తొలి సోలార్​ మిషన్​ ఆదిత్య ఎల్​1 చూడలేదు! ఇందుకు ఒక కారణం ఉంది. అదేంటంటే..

సంపూర్ణ సూర్య గ్రహణాన్ని చూడలేని ఆదిత్య ఎల్​1..
సంపూర్ణ సూర్య గ్రహణాన్ని చూడలేని ఆదిత్య ఎల్​1..

సంపూర్ణ సూర్య గ్రహణాన్ని చూడలేని ఆదిత్య ఎల్​1..

Solar eclipse of april 8 2024 : సంపూర్ణ సూర్య గ్రహణం కోసం ప్రపంచం సిద్ధమవుతోంది. ఈ అరుదైన ఘట్టాన్ని చూసేందుకు అందరు ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సూర్య గ్రహణాన్ని.. భారత దేశ తొలి సోలార్​ అబ్జర్వేటరీ అయిన ఆదిత్య ఎల్​1 ట్రాక్​ చేయలేదు! ఇందుకు గల కారణాన్ని శాస్త్రవేత్తలు వివరించారు.

సంపూర్ణ సూర్య గ్రహణాం- ఆదిత్య ఎల్​1..

భారత కాలమానం ప్రకారం.. ఈ సూర్య గ్రహణం.. ఏప్రిల్​ 8 రాత్రి 9 గంటల 12 నిమిషాలకు మొదలై.. ఏప్రిల్​ 9 తెల్లవారుజాము 2 గంటల 22 నిమిషాలకు పూర్తవుతుంది. సంపూర్ణ సూర్య గ్రహణం మాత్రం.. ఏప్రిల్​ 8 రాత్రి 10 గంటల 8 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అంటే.. భారత దేశ ప్రజలు.. ఈ సంపూర్ణ సూర్య గ్రహణాన్ని కళ్లారా వీక్షించలేరు. నార్త్​ అమెరికాలో మాత్రం ఈ సంపూర్ణ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది.

Solar eclipse in India : ఇది చాలా అరుదైన సంపూర్ణ సూర్య గ్రహణం! దాదాపు దశాబ్ద కాలం తర్వాత.. న్యూయార్క్​లోని పశ్చిమ, ఉత్తర భాగాలకు ఈ గ్రహణాన్ని వీక్షించే అవకాశం లభించింది. ఇక సంపూర్ణ గ్రహణం సమయంలో చంద్రుడు.. సూర్యుడిని పూర్తిగా కప్పేయనున్నాడు. ఆ సమయంలో చీకటి అలుముకుంటుంది. ఏప్రిల్​ 8న సంభవించే సంపూర్ణ సూర్య గ్రహణం.. నార్త్​ అమెరికా, మెక్సికో, కెనడాలను కవర్​ చేస్తుంది.

కానీ భారత దేశ ఆదిత్య ఎల్​1 శాటిలైట్​ మాత్రం.. ఈ 2024 సంపూర్ణ సూర్య గ్రహణాన్ని వీక్షించలేదు! ఇందుకు ఒక ముఖ్య కారణం ఉంది. సిస్టెమ్​లో ఫాల్ట్​ లేదు. కానీ 365 రోజులు, 24x7 పాటు సూర్యుడిని నిరంతరాయంగా ట్రాక్​ చేసే విధంగా.. ఆదిత్య ఎల్​1ని ప్లేస్​ చేసింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఎలాంటి గ్రహణం సంభవించినా.. సూర్యుడి వ్యూని శాటిలైట్​ కోల్పోకుండా ఉండే విధంగా.. స్పాట్​ని ఎంచుకుంది ఇస్రో. చంద్రుడు.. ఆదిత్య ఎల్​1కి వెనుక భాగంలో ఉండటంతో.. 2024 సంపూర్ణ సూర్య గ్రహణాన్ని వీక్షించలేదు.

Aditya L1 Solar eclipse : "భూమి నుంచి 1.5 మిలియన్​ కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్​ పాయింట్​ 1 (ఎల్​1)లో ఆదిత్య ఎల్​1ని పెట్టింది ఇస్రో. ఇది హాలో ఆర్బిట్​ కిందకు వస్తుంది. ఆ ఆర్బిట్​లో ఉండే శాటిలైట్​లకు.. గ్రహణాలతో ఇబ్బంది ఉండదు. సోలార్​ యాక్టివిటీలను నిరంతరాయంగా పరిశీలించవచ్చు," అని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.

కృత్రిమ సూర్య గ్రహణం..

Total solar eclipse 2024 : సూర్యుడి మీద అధ్యయనం కోసం ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఆదిత్య ఎల్​1 బరువు 1,500 కేజీలు. దీని వ్యయం రూ. 400 కోట్లు. ఇంకా చెప్పాలంటే.. అధ్యయనంలో భాగంగా.. ఆదిత్య ఎల్​1 కృత్రిమ గ్రహణాలను రూపొందించుకోగలదు. ఇందుకోసం ఒక స్పెషల్​ ఇన్​స్ట్రుమెంట్​ని శాటిలైట్​కి అమర్చింది ఇస్రో. దీని పేరు.. విజిబుల్​ ఎమిషన్​ లైన్​ కొరొనాగ్రఫి. దీని సాయంతో.. సన్​ డిస్క్​ నుంచి లైట్​ ఎలిమినేట్​ అయిపోతుందని, ఆ పరిస్థితులను ఆదిత్య ఎల్​1 పరిశీలించి, అధ్యయనం చేస్తుంది ఇస్రో ఛైర్మన్​ సోమ్​నాథ్​ తెలిపారు.

తదుపరి వ్యాసం