తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని పిటిషన్.. సుప్రీం అక్షింతలు

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని పిటిషన్.. సుప్రీం అక్షింతలు

HT Telugu Desk HT Telugu

10 October 2022, 12:21 IST

    • ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు (PTI)

సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, అక్టోబరు 10: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ గోవంశ్ సేవా సదన్ అనే ఎన్జీవో దాఖలు చేసిన పిల్‌ను సుప్రీంకోర్టు విచారించింది.

జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, అభయ్‌ ఎస్‌ ఓకాతో కూడిన ధర్మాసనం ఈ అంశం ఏ ప్రాథమిక హక్కును దెబ్బతీస్తోందని పిటిషనర్‌ను ప్రశ్నించింది.

‘ఇది కోర్టు పనా? ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసినప్పుడు మేం జరిమానా విధించాల్సిన అవసరం ఉంటుంది. ఏ ప్రాథమిక హక్కుకు భంగం కలిగింది?’ అని ధర్మాసనం పేర్కొంది.

గోసంరక్షణ చాలా ముఖ్యమని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు ముందు వాదించారు. ఈ పిటిషన్ వేసినందుకు జరిమానా విధించాల్సి వస్తుందని సదరు న్యాయవాదిని బెంచ్ హెచ్చరించింది. దీంతో పిటిషనర్ తరపు న్యాయవాది తన అభ్యర్ధనను ఉపసంహరించుకున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం