తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Asaduddin Owaisi : ఓవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్​ ఎక్స్​ప్రెస్​పై రాళ్ల దాడి!

Asaduddin Owaisi : ఓవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్​ ఎక్స్​ప్రెస్​పై రాళ్ల దాడి!

08 November 2022, 12:16 IST

  • Asaduddin Owaisi stone pelting : అసదుద్దీన్​ ఓవైసీ ప్రయాణిస్తున్న వందే భారత్​ ఎక్స్​ప్రెస్​పై రాళ్ల దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఏఐఎంఐఎం నేత షేర్​ చేశారు.

వందే భారత్​ ఎక్స్​ప్రెస్​లో అసదుద్దీన్​ ఓవైసీ
వందే భారత్​ ఎక్స్​ప్రెస్​లో అసదుద్దీన్​ ఓవైసీ (Waris Pathan/twitter)

వందే భారత్​ ఎక్స్​ప్రెస్​లో అసదుద్దీన్​ ఓవైసీ

Asaduddin Owaisi stone pelting incident : ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ​ ప్రయాణిస్తున్న రైలుపై రైళ్ల దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీకి చెందిన నేత వారిస్​ పఠాన్​ తెలిపారు. కాగా.. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు.

గుజరాత్​లో ఉన్న అసదుద్దీన్​ ఓవైసీ.. సోమవారం సాయంత్రం అహ్మదాబాద్​ నుంచి సూరత్​కు వెళ్లేందుకు 'వందే భారత్​' ఎక్స్​ప్రెస్​ ఎక్కారు. మార్గం మధ్యలో రైలుపై రాళ్ల దాడి జరిగింది!

"అసదుద్దీన్​, సబీర్ ​కబ్లివాల్​తో పాటు ఏఎఐఎంఐఎం జాతీయ బృందం.. అహ్మదాబాద్​ నుంచి సూరత్​కు వెళ్లేందుకు సోమవారం సాయంత్రం వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ ఎక్కింది. గుర్తుతెలియని వ్యక్తులు కొందరు రైలుపై రాళ్ల దాడి చేశారు," అని వారిస్​ పఠాన్​.. హిందీలో ట్వీట్​ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్వీట్​తో పాటు షేర్​ చేశారు.

Gujarat Assembly Elections AIMIM : గుజరాత్​ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ తరఫున ఓవైసీ తీవ్రస్థాయిలో ప్రచారాలు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనపై వెస్ట్​ రైల్వే స్పందించింది.

"వందే భారత్​ ఎక్స్​ప్రెస్​పై రాయితో దాడి చేశారు. ఇది నిజమే. అయితే.. దీని వల్ల ట్రైన్​ లోపల ఉన్న గ్లాస్​పై ఎలాంటి ప్రభావం పడలేదు. అంక్లేశ్వర్​- భరూచ్​ సెక్షన్​ మధ్యలో ఈ ఘటన జరిగింది. ఈ-2 కోచ్​ ఔటర్​ గ్లాస్​ స్వల్పంగా ధ్వంసమైంది. దీనిని అధికారులు రిప్లేస్​ చేశారు. ఇన్నర్​ గ్లాస్​పై ప్రభావం పడలేదు," అని వెస్ట్​ రైల్వే పీఆర్​ఓ(పబ్లిక్​ రిలేషన్స్​ ఆఫీసర్​) సుమిత్​ ఠాకూర్​ తెలిపారు.

ఈ ఘటనపై ఏఐఎంఐఎం మండిపడింది. బీజేపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది.

Asaduddin Owaisi latest news : "మోదీజీ.. ఇక్కడ ఏం జరుగుతోంది. వందే భారత్​ను కొన్నిసార్లు పశువులు ఢీకొడుతున్నాయి. ఇక ఇప్పుడు రాళ్ల దాడి జరుగుతోంది. సూరత్​కు సమీపంలో ఉన్నప్పుడు మేము ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. గ్లాస్​ పగిలింది. ఈ వెంటనే మరో రాయి వచ్చి పడింది. ఈ రైలులో ఓవైసీ సాహెబ్​ కూడా ఉన్నారు. మా మీద ఎన్ని దాడులు జరిగినా.. మా గొంతుకను ఎవ్వరు అణచివేయలేరు," అని వారిస్​ పఠాన్​ పేర్కొన్నారు.

మరోవైపు.. వందే భారత్​పై ఎవరు రాళ్లు విసురారు? అన్న ప్రశ్నకు ప్రస్తుతం సమాధానం దొరకలేదు. పోలీసులు కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

గుజరాత్​లో 182 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్​ 1,5 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు.. డిసెంబర్​ 8న విడుదల కానున్నాయి.

తదుపరి వ్యాసం