తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Stock Market | లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ@17,100

Stock market | లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ@17,100

HT Telugu Desk HT Telugu

28 April 2022, 9:25 IST

    • బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీలు గురువారం ట్రేడింగ్​ను సానుకూలంగా ప్రారంభించాయి. కాగా.. ఏప్రిల్​ ఎక్స్​పైరీ కావడంతో ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
స్టాక్​ మార్కెట్​ ఇండియా
స్టాక్​ మార్కెట్​ ఇండియా (REUTERS)

స్టాక్​ మార్కెట్​ ఇండియా

Stock market today | దేశీయ సూచీలు గురువారం సెషన్​ను సానుకూలంగా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 264 పాయింట్లు వృద్ధి చెంది.. 57,083 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 17,100 మార్కును అందుకుంది. ప్రస్తుతం 84 పాయింట్ల లాభంతో 17,122 వద్ద ట్రేడ్​ అవుతోంది.

గత ట్రేడింగ్​ సెషన్​ను 56,819 వద్ద ముగించిన సెన్సెక్స్​.. నేటి సెషన్​ను 57,296 వద్ద ప్రారంభించింది. ఇక నిఫ్టీ గత సెషన్​ను 17,038 వద్ద ముగించగా.. తాజాగా 17,189 వద్ద ఓపెన్​ అయ్యింది.

కాగా.. సూచీలు సానుకూలంగానే ప్రారంభమైనప్పటికీ, ఏప్రిల్​ ఎక్స్​పైరీ కావడంతో గురువారం ట్రేడింగ్​ సెషన్​ ఒడుదొడుకుల్లో కొనసాగవచ్చని మార్కెట్​ విశ్లేషణలు వెలువడుతున్నాయి.

లాభాలు.. నష్టాలు..

హెచ్​యూఎల్​, సన్​ఫార్మా షేర్లు 2శాతం మేర లాభాలు గడించాయి. ఇండస్​ఇండ్​, డా. రెడ్డీస్​, టాటా స్టీల్​, ఎం అండ్​ ఎం, ఇన్ఫోసిస్​ షేర్లు 1శాతం మేర వృద్ధి చెందాయి.

హెచ్​సీఎల్​ టెక్​, ఎయిర్​టెల్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం