తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Winter Storm : భీకర మంచు తుపాను ధాటికి అమెరికాలో 31మంది మృతి!

US winter storm : భీకర మంచు తుపాను ధాటికి అమెరికాలో 31మంది మృతి!

26 December 2022, 7:33 IST

    • US winter storm death toll : మంచు తుపాను.. అమెరికాను గడగడలాడిస్తోంది. ఈ విపత్తు ధాటికి ఇప్పటికే 31మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
న్యూయార్క్​లోని ఓ ప్రాంతంలో పరిస్థితి ఇలా..
న్యూయార్క్​లోని ఓ ప్రాంతంలో పరిస్థితి ఇలా.. (AP)

న్యూయార్క్​లోని ఓ ప్రాంతంలో పరిస్థితి ఇలా..

US winter storm death toll : అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా తూర్పు అమెరికా ప్రాంతాల్లో.. లక్షలాది మందిపై ఈ మంచు తుపాను ప్రభావం పడింది. వేరువేరు ఘటనల్లో ఇప్పటివరకు 31మంది ప్రాణాలు కోల్పోయారు.

ట్రెండింగ్ వార్తలు

CBSE Class 12 Result 2024: సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్ కు రిజిస్ట్రేషన్ ప్రారంభం

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

క్రిస్మస్​ జరగలేదు..!

న్యూయార్క్​లోని బఫెల్లో ప్రాంతంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు కారణంగా ప్రజలు బయటకు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. అత్యవసర సేవలు కూడా నిలిచిపోయాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్​ సంక్షోభం నెలకొంది. బయట ఉంచిన వాహనాలు మంచులో కూరుకుపోయాయి.

US winter storm 2022 : "బయటకి వెళుతుంటే.. ఏదో యుద్ధభూమిలోకి దిగుతున్నట్టు అనిపిస్తోంది. రోడ్డు పక్కన ఉంచిన వాహనాలు మంచులో కూరుకుపోయాయి. పరిస్థితులు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాయి. ఈ మంచు తుపాను గురించి ఈ ఒక్కరోజే కాదు.. తర్వాతి తరం వారు కూడా మాట్లాడుకుంటారు. పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. ఇప్పట్లో ఇది ముగిసేడట్టు కూడా కనిపించడం లేదు," అని న్యూయార్క్​ గవర్నర్​ కేథీ హోచుల్​ తెలిపారు.

అమెరికాలో మంచు తుపాను క్రిస్మస్​ వేడుకలపై ప్రభావం చూపించింది. ముఖ్యంగా దేశంలోని తూర్పు ప్రాంతాల్లో.. క్రిస్మస్​ నాడు అంధకారం అలుముకుంది. కొన్ని ప్రాంతాల్లో మంగళవారం వరకు విద్యుత్​ పునరుద్ధరణ జరగకపోవచ్చు!

బఫెల్లోలో పరిస్థితి ఇలా..

విమాన సేవలు బంద్​..

US winter storm today : దశాబ్దాల్లోనే అత్యంత శక్తివంతమైన మంచు తుపానుగా దీనిని పరిగణిస్తున్నారు. అనేక దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలు రద్దు అయ్యాయి. ఆదివారం ఒక్క రోజే.. 2400 యూఎస్​ విమానాలు ఎగరలేదు. శనివారం ఆ సంఖ్య 3,500గాను.. శుక్రవారం 6000గాను ఉంది. పలు ప్రాంతాల్లో విమానాశ్రయాలే మూతపడిపోయాయి. ఆట్లాంటా, చికాగో, డెన్వర్​, డెట్రాయిట్​, న్యూయార్క్​ విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. హాలీడే సీజన్​లో ట్రిప్స్​కు ప్లాన్​ చేసుకున్న వారందరు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ప్లాన్​లను రద్దు చేసుకుని, ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా హాలీడే సీజన్​లో పలు వ్యాపారాలు దారుణందా దెబ్బతిన్నాయి!

US winter storm latest updates : కొలొరాడోలో నలుగురు, న్యూయార్క్​లో 12మందితో కలిపి మొత్తం మీద మంచు తుపాను ధాటికి 31మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇంకొన్ని రోజుల పాటు తూర్పు అమెరికాపై మంచు తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త విని ప్రజలు ఇంకా భయపడిపోతున్నారు.

తదుపరి వ్యాసం