తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘అమెరికా చెప్పినా జెలెన్​స్కీ పట్టించుకోలేదు.. అందుకే ఈ యుద్ధం’

‘అమెరికా చెప్పినా జెలెన్​స్కీ పట్టించుకోలేదు.. అందుకే ఈ యుద్ధం’

Sharath Chitturi HT Telugu

11 June 2022, 11:12 IST

    • Russia Ukraine war : రష్యా ఉక్రెయిన్​ యుద్ధం మొదలై దాదాపు నాలుగు నెలలు పూర్తవుతోంది. కాగా.. యుద్ధానికి ముందు.. అమెరికా మాటలను ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ పట్టించుకోలేదని అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్​ వ్యాఖ్యానించారు.
జో బైడెన్​
జో బైడెన్​ (AP/file)

జో బైడెన్​

Russia Ukraine war : రష్యా- ఉక్రెయిన్​ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధానికి రష్యా సన్నద్ధమవుతున్నట్టు అమెరికాకు సమాచారం ఉందని, ఆ విషయాన్ని ఉక్రెయిన్​ అధ్యక్షుడు వ్లాదిమిర్​ జెలెన్​స్కీకి చెప్పేందుకు ప్రయత్నించినట్టు వెల్లడించారు. కానీ ఆ సమయంలో అమెరికాను జెలెన్​స్కీ పట్టించుకోలేదని, అసలు తాము చెప్పాల్సినది వినలేదని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

CBSE Class 12 Result 2024: సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్ కు రిజిస్ట్రేషన్ ప్రారంభం

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

అమెరికా లాస్​ఏంజెల్స్​లో జరిగిన డెమొక్రటిక్​ ఫండ్​రైజర్​ కార్యక్రమంలో పాల్గొన్న జో బాడెన్​.. ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్​కు తాము అండగా నిలిస్తున్నట్టు చెప్పిన ఆయన, యుద్ధం ఆరంభం నుంచి తాము చేపట్టిన చర్యలను వివరించారు.

"రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటిది(రష్యా ఉక్రెయిన్​ యుద్ధం) ఎప్పుడు జరగలేదు. నేను ఎక్కువ చేసి చెబుతున్నా అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆయన(రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​) యుద్ధానికి సిద్ధపడుతున్నట్టు, ఏ క్షణంలోనైనా సరిహద్దును దాటవచ్చన్నట్టు నాకు తెలుసు. ఆ విషయంపై అసలు సందేహమే లేదు. కానీ జెలెన్​స్కీ మమ్మల్ని వినడానికి ఇష్టపడలేదు," అని బైడెన్​ అన్నారు.

యుద్ధం వేళ.. తన నాయకత్వ లక్షణాలతో లక్షలాది మందిలో స్ఫూర్తి నింపారు జెలెన్​స్కీ. కానీ యుద్ధానికి ముందు.. ఉక్రెయిన్​ను జెలెన్​స్కీ సిద్ధం చేయలేదని, అందుకే పరిస్థితులు ఇంత తీవ్రంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్​ యుద్ధం మొదలైంది. అందుకు కొన్ని రోజుల ముందు నుంచే.. రష్యా యుద్ధం చేయదంటూ అమెరికా హెచ్చరికలను బహిరంగంగానే కొట్టిపడేశారు జెలెన్​స్కీ.

కొనసాగుతున్న మారణహోమం..

  • ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. యుద్ధం మొదలై.. దాదాపు నాలుగు నెలలు గడుస్తోంది. యుద్ధానికి తొందరగా ముగింపు పడకపోతే.. ఇప్పటివరకు తమకు మద్దతుగా నిలిచిన పాశ్చాత్య దేశాలు.. పట్టించుకోవడం మానేస్తాయని ఉక్రెయిన్​ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
  • మరోవైపు యుద్ధంతో ఉక్రెయిన్​కు భారీ నష్టమే జరుగుతోంది. ఇప్పటికే వందలాది నగరాలు ధ్వంసమయ్యాయి. కాగా.. రోజుకు 200కుపైగా మంది ఉక్రెయిన్​ సైనికులు ప్రాణాలు వీడుతున్నట్టు ఆ దేశం​ పేర్కొంది. రష్యాను అడ్డుకునేందుకు మరిన్ని ఆయుధాలు కావాలని, తమకు సాయం చేయాలని ప్రపంచ దేశాలను వేడుకుంటోంది.
  • తూర్పు ఉక్రెయిన్​ పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్​ సైనికుల మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. లుహనెస్క్​, డోనెస్క్​ ప్రాంతాల్లోని నగరాలు, గ్రామాలను ఆక్రమించుకునేందుకు రష్యా సైన్యం తీవ్రంగా కృషిచేస్తోంది. ఈ క్రమంలోనే వందలాది మంది పౌరులు.. ఆయా ప్రాంతాలను విడిచిపెట్టి వలస వెళ్లిపోతున్నారు. సొంత ఊళ్లకు ఎప్పుడు తిరుగొస్తామో అన్న బాధతో కన్నీరు పెట్టుకుంటున్నారు.
  • యుద్ధం వేళ ఈయూలో చేరేందుకు ఆసక్తి కనబరిచారు ఆ దేశాధ్యక్షుడు జెలెన్​స్కీ. ఉక్రెయిన్​ను ఈయూలో కలిపే ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘ఉక్రెయిన్​ ప్రజలకు ఈయూ అండగా ఉంటుందన్న మాటలను నిజం చేయండి,’ అంటూ వ్యాఖ్యానించారు జెలెన్​స్కీ.

తదుపరి వ్యాసం