తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Britain Pm Elections | తొలి రౌండ్లో రిషి సున‌క్ ఘ‌న విజ‌యం

Britain PM elections | తొలి రౌండ్లో రిషి సున‌క్ ఘ‌న విజ‌యం

HT Telugu Desk HT Telugu

13 July 2022, 23:04 IST

  • Britain PM elections | బ్రిటన్ ప్ర‌ధాని రేసులో రిషి సున‌క్ దూసుకుపోతున్నారు. అధికార క‌న్స‌ర్వేటివ్ పార్టీలో ఆయ‌న‌కు మ‌ద్ద‌తు అనూహ్యంగా పెరుగుతోంది. తాజాగా జ‌రిగిన తొలి రౌండ్ పోటీలో రిషి ప్ర‌త్య‌ర్థుల క‌న్నా ఎక్కువ ఓట్లు సాధించారు.

రిషి సున‌క్
రిషి సున‌క్ (REUTERS)

రిషి సున‌క్

Britain PM elections | బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌ద‌వికి బోరిస్ జాన్స‌న్ రాజీనామా చేసిన నేప‌థ్యంలో నూత‌న ప్ర‌ధాని ఎంపిక అనివార్య‌మైంది. కొత్త ప్ర‌ధాని రేసులో భార‌త సంత‌తికి చెందిన రిషి సున‌క్‌, సెల్లా బ్రేవ‌ర్మ‌న్ ఉన్నారు. వారిలో జాన్స‌న్ మంత్రివ‌ర్గంలో ఆర్థిక మంత్రిగా ప‌ని చేసిన రిషి సున‌క్‌కు పార్టీ ఎంపీల నుంచి గ‌ణ‌నీయ మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.

Britain PM elections | తొలి రౌండ్లో రిషి సున‌క్‌కు 88 ఓట్లు

ప్ర‌ధాని ప‌ద‌వికి సంబంధించి క‌న్స‌ర్వేటివ్ పార్టీలో జ‌రిగిన తొలి రౌండ్ పోటీలో రిషి సున‌క్‌కు అత్య‌ధికంగా 88 ఓట్లు వ‌చ్చాయి. భారత సంత‌తికి చెందిన మ‌రో పోటీదారు సెల్లా బ్రేవ‌ర్మ‌న్ కు కేవ‌లం 32 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. అయినా, ఆమె ఇంకా పోటీలోనే ఉన్నారు. ఈ తొలి రౌండు త‌రువాత పోటీదారుల సంఖ్య 8 నుంచి ఆరుకి త‌గ్గింది. అతి త‌క్కువ ఓట్లు వ‌చ్చిన ఇద్ద‌రు పోటీ నుంచి ఎలిమినేట్ అయ్యారు.

Britain PM elections | చివ‌రి స్థానంలో సెల్లా

భార‌తీయ మూలాలున్న అటార్నీ జ‌న‌ర‌ల్‌ సెల్లా బ్రేవ‌ర్మ‌న్ పోటీలో మిగిలిన వారిలో చివ‌రిస్థానంలో నిలిచారు. ఆమెకు 32 ఓట్లు రాగా, ఆమె క‌న్నా త‌క్కువ‌గా న‌దీమ్ జ‌వాహీకి 25 ఓట్లు, మాజీ మంత్రి జెరెమీ హంట్‌కు 18 ఓట్లు వ‌చ్చాయి. దాంతో, ఈ రేసు నుంచి న‌దీమ్ జ‌వాహీ, జెరెమీ హంట్ తొల‌గిపోయారు. రిషి సున‌క్ త‌రువాత అధిక ఓట్లు సాధించిన వారిలో పెన్నీ మార్డంట్‌కు 67 ఓట్లు, లిజ్ ట్ర‌స్‌కు 50 ఓట్లు, కెమి బాడెన‌చ్‌కు 40 ఓట్లు, టామ్ టుగెంధ‌ట్‌కు 37 ఓట్లు వ‌చ్చాయి. ఆ త‌రువాత స్థానంలో 32 ఓట్ల‌తో సెల్లా బ్రేవ‌ర్మ‌న్ ఉన్నారు. ఈ పోటీలో త‌దుప‌రి రౌండ్‌కు వెళ్లాలంటే క‌నీసం 30 ఓట్లు రావాల్సి ఉంటుంది.

Britain PM elections | టోరీల్లో సున‌క్ వైపే మొగ్గు

మొత్తంగా క‌న్స‌ర్వేటివ్ పార్టీ ఎంపీల్లో రిషి సున‌క్ వైపు భారీ మొగ్గు క‌నిపిస్తోంది. రిషి సున‌క్ త‌రువాత స్థానంలో నిలిచిన పెన్నీ మార్డంట్‌కు, రిషి సున‌క్‌కు మ‌ధ్య దాదాపు 21 ఓట్ల తేడా ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో, త‌దుప‌రి రౌండ్ల‌లోనూ Rishi Sunakకి ఎదురు ఉండ‌ద‌ని భావిస్తున్నారు. అయితే, పార్టీ స‌భ్యుల్లో అత్య‌ధికులు పెన్నీ మార్డంట్‌కు మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశ‌ముంద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. వారి ఓట్ల‌లో మెజారిటీ సంపాదించ‌డం ప్ర‌ధాని ప‌ద‌వి చేప‌ట్ట‌డానికి అత్యంత ఆవ‌శ్య‌కం.

Britain PM elections | త్రిముఖ పోటీ

ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని రేసులో త్రిముఖ పోరు నెల‌కొనేలా క‌నిపిస్తోంది. ప్ర‌ధానంగా పోటీ రిషి సున‌క్‌, పెన్నీ మార్డంట్‌, లిజ్ ట్ర‌స్‌ల మ‌ధ్య ఉంటుంద‌ని బ్రిట‌న్ రాజ‌కీయాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్న‌ రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. త‌దుప‌రి రౌండ్ గురువారం జ‌ర‌గ‌నుంది. ఆ రౌండ్‌లో 358 మంది పార్టీ ఎంపీలు ప్ర‌స్తుతం బ‌రిలో ఉన్న‌వారి నుంచి మ‌రో ఇద్ద‌రిని ఎలిమినేట్ చేస్తారు. చివ‌ర‌గా, బ‌రిలో నిలిచిన వారి తుది జాబితా రూపొందుతుంది. మొత్తంగా, జులై 21 లోగా బ‌రిలో ఇద్ద‌రే నిల‌వాల్సి ఉంటుంది. ఆ త‌రువాత నిర్ణ‌యం క‌న్స‌ర్వేటివ్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రుగుతుంది. దేశ్యాప్తంగా 2 లక్ష‌ల మంది పార్టీ స‌భ్యులు, మెజారిటీ ఓటు ద్వారా బ‌రిలో నిలిచిన ఇద్ద‌రిలో ఒక‌రిని ఎంపిక చేస్తారు.

తదుపరి వ్యాసం