తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rishi Sunak As Uk New Pm | బ్రిట‌న్ త‌దుప‌రి పీఎం మ‌న రిషి సున‌క్‌?

Rishi Sunak as UK new PM | బ్రిట‌న్ త‌దుప‌రి పీఎం మ‌న రిషి సున‌క్‌?

HT Telugu Desk HT Telugu

07 July 2022, 18:14 IST

    • ప్ర‌ధాని ప‌ద‌వికి బోరిస్ జాన్స‌న్ రాజీనామా చేసిన నేప‌థ్యంలో.. త‌దుప‌రి ప్ర‌ధాని ఎవ‌ర‌నే విష‌యంలో క‌న్స‌ర్వేటివ్ పార్టీలో క‌స‌ర‌త్తులు కొన‌సాగుతున్నాయి. అయితే, ఈ రేసులో భార‌తీయ మూలాలున్న ఆర్థిక‌వేత్త రిషి సున‌క్ ముందంజ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అదే నిజ‌మైతే, భార‌తీయ సంత‌తికి చెందిన వ్య‌క్తి యూకే ప్ర‌ధాని కావ‌డం రికార్డు సృష్టించ‌డమే అవుతుంది.
రిషి సున‌క్
రిషి సున‌క్

రిషి సున‌క్

ఆర్థిక మంత్రిగా రాజీనామా

రిషి సున‌క్ బోరిస్ జాన్స‌న్ ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ముఖ్య‌మైన ఆర్థిక మంత్రిత్వ శాఖ‌ను నిర్వ‌హించారు. 2020 జ‌న‌వ‌రిలో ఆయ‌న బ్రిట‌న్ ఆర్థిక శాఖ ప‌గ్గాలు చేప‌ట్టారు. ఈ అవ‌కాశం బోరిస్ జాన్స‌నే ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. క‌రోనా సంక్షోభం స‌మ‌యంలో స‌మ‌ర్ధ‌వంతంగా విధులు నిర్వ‌ర్తించి ప్ర‌శంస‌లు పొందారు. కోట్లాది పౌండ్ల‌ను వివిధ ప‌థ‌కాల కింద వ్యాపార‌స్తుల‌కు, ప్ర‌జ‌ల‌కు, ఉద్యోగుల‌కు అందించారు. జాన్స‌న్ ప‌ద‌విని వీడ‌డంలోనూ రిషి కీల‌కంగా ఉన్నారు. ఆర్థిక మంత్రి ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేయ‌డంతో బ్రిట‌న్ ప్ర‌భుత్వంలో సంక్షోభం మ‌రింత ముదిరింది. ఇప్పుడు నూత‌న ప్ర‌ధాన‌మంత్రి రేసులో రిషి సున‌క్ ముందంజ‌లో ఉన్నారు.

Rishi Sunak | మ‌రో ఇద్ద‌రితో పోటీ..

రిషి సున‌క్‌తో పాటు లాడ్ బ్రోక్స్‌, మాజీ ర‌క్ష‌ణ మంత్రి పెన్నీ మార్డంట్‌లు కూడా ప్ర‌ధాని ప‌ద‌వి కోసం పోటీ ప‌డుతున్నారు. రిషి సున‌క్‌కు `డిషీ రిషీ` అనే నిక్‌నేమ్ కూడా ఉంది. సున‌క్‌పై ప్ర‌శంస‌ల‌తో పాటు విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. బ్రిట‌న్ లో నెల‌కొన్న ఆర్థిక సంక్షోభ ప‌రిస్థితుల‌ను స‌రిగ్గా హ్యాండిల్ చేయ‌లేద‌ని, ప్ర‌స్తుత ఆర్థిక మంద‌గ‌మ‌నానికి ఆయ‌న విధానాలే కార‌ణ‌మ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. బ్రిట‌న్‌లో పెరుగుతున్న జీవ‌న వ్య‌యం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే విష‌యంలో స‌రైన స‌మ‌యంలో స్పందించ‌లేద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన నేరంపై రిషి ఒక‌సారి ఫైన్ కూడా చెల్లించారు.

Rishi Sunak | ఇన్ఫోసిస్ నారాయ‌ణ మూర్తి అల్లుడు

రిషి సున‌క్ మూలాలు భార‌త్‌లోని పంజాబ్‌లో ఉన్నాయి. ఆయ‌న తాత పంజాబ్ నుంచి బ్రిట‌న్ వ‌ల‌స వెళ్లారు. ఇన్ఫోసిస్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు, ఆ సంస్థ మాజీ చైర్మ‌న్ నారాయ‌ణ మూర్తికి రిషి సున‌క్ అల్లుడు అవుతారు. నారాయ‌ణ మూర్తి కూతురు అక్ష‌త మూర్తిని రిషి సున‌క్ పెళ్లి చేసుకున్నారు. వారిది ప్రేమ వివాహం. కాలిఫోర్నియా లో చ‌దువుకుంటున్న స‌మ‌యంలో వారికి ప‌రిచ‌య‌మైంది. ఆ జంట‌కు ఇద్ద‌రు కుమార్తెలు.

రిషి సున‌క్‌కు 42 ఏళ్లు

బ్రిట‌న్ ప్ర‌ధాని రేసులో ఉన్న రిషి సున‌క్‌కు 42 ఏళ్లు. 1980 మే 12న సౌతంప్ట‌న్‌లో ఆయ‌న జ‌న్మించారు. ఆయ‌న తండ్రి నేష‌న‌ల్ హెల్త్ స‌ర్వీస్‌లో జాబ్ చేసేవారు. త‌ల్లి ఫార్మ‌సిస్ట్‌. రిషి సున‌క్ మొద‌ట కొంద‌రు మిత్రుల‌తో క‌లిసి ఒక ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీని స్థాపించారు.

తదుపరి వ్యాసం