తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Election Results: ప్రాంతాల వారీగా కర్నాటక ఫలితాల ముఖచిత్రం

Karnataka election results: ప్రాంతాల వారీగా కర్నాటక ఫలితాల ముఖచిత్రం

HT Telugu Desk HT Telugu

13 May 2023, 12:36 IST

    • Karnataka election results: బెంగళూరు, కోస్టల్ కర్నాటకలను మినహాయిస్తే, మిగతా అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. ముఖ్యంగా, గత ఎన్నికల్లో బీజేపీ అధిక సంఖ్యలో స్థానాలను గెల్చుకున్న ప్రాంతాల్లో కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పాగా వేయగలిగింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Ayush Chopra)

ప్రతీకాత్మక చిత్రం

Karnataka election results: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (karnataka assembly elections 2023) ఫలితాల్లో.. బెంగళూరు, కోస్టల్ కర్నాటకలను మినహాయిస్తే, మిగతా అన్ని ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది. ముఖ్యంగా, గత ఎన్నికల్లో బీజేపీ అధిక సంఖ్యలో స్థానాలను గెల్చుకున్న ప్రాంతాల్లో కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పాగా వేయగలిగింది.

Karnataka election results: ప్రాంతాల వారీగా చూస్తే..

  • ఓల్డ్ మైసూరు: కర్నాటకలో ఓల్డ్ మైసూరు ప్రాంతంలో అత్యధికంగా అసెంబ్లీ స్థానాలున్నాయి. ఆ ప్రాంతంలో మొత్తం 64 సీట్లు ఉండగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 38 స్థానాల్లో స్పష్టమైన ఆధిత్యతతో కొనసాగుతోంది. బీజేపీ కేవలం 5 సీట్లలో ముందంజలో ఉంది. జేడీఎస్ 18 సీట్లలో ఆధిక్యతతో కొనసాగుతోంది. మూడు సీట్లలో ఇతరులు ముందంజలో ఉన్నారు.
  • బొంబాయి కర్నాటక: ఈ ప్రాంతంలో మొత్తం 50 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇక్కడ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతోంది. మొత్తం 50 సీట్లలో 32 సీట్లలో కాంగ్రెస్, 17 స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో జేడీఎస్ ఆధిక్యతలో కొనసాగుతున్నాయి.
  • హైదరాబాద్ కర్నాటక: ఈ హైదరాబాద్ కర్నాటక ప్రాంతంలో మొత్తం 40 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 25 స్థానాల్లో, బీజేపీ10 స్థానాల్లో, జేడీఎస్ 3 సీట్లలో, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు.
  • బెంగళూరు: బీజేపీ ఆధిక్యత కొనసాగుతున్న ప్రాంతం ఇది. రాష్ట్ర రాజధాని ప్రాంతమైన బెంగళూరు, నగర శివార్లలో మొత్తం 28 సీట్లు ఉన్నాయి. వాటిలో 11 సీట్లలో కాంగ్రెస్, 16 స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో జేడీఎస్ ఆధిక్యతలో ఉన్నాయి.
  • సెంట్రల్ కర్నాటక: సెంట్రల్ కర్నాటకలో 23 సీట్లు ఉన్నాయి. వాటిలో 13 సీట్లలో కాంగ్రెస్, 8 సీట్లలో బీజేపీ , ఒక స్థానంలో జేడీఎస్, ఒక స్థానంలో ఇతరులు ఆధిక్యతలో ఉన్నారు.
  • కోస్టల్ బెంగళూరు: ఈ ప్రాంతంలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలుండగా, వాటిలో 13 సీట్లలో బీజేపీ ఆధిక్యత కొనసాగుతోంది. కేవలం 4 సీట్లలో కాంగ్రెస్, ఒక సీటులో జేడీఎస్, ఒక స్థానంలో ఇతరులు ముందంజలో ఉన్నాయి.

తదుపరి వ్యాసం