తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  నిండు గర్భిణిపై గ్యాంగ్ ‌రేప్.. భర్తను బంధించి కిరాతకం..

నిండు గర్భిణిపై గ్యాంగ్ ‌రేప్.. భర్తను బంధించి కిరాతకం..

HT Telugu Desk HT Telugu

06 June 2022, 10:39 IST

    • భర్తను బంధించి నిండు గర్భిణిపై ఐదుగురు కిరాతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
నిండు గర్భిణిపై సామూహితక అత్యాచారం
నిండు గర్భిణిపై సామూహితక అత్యాచారం (HT Telugu)

నిండు గర్భిణిపై సామూహితక అత్యాచారం

ఇస్లామాబాద్, జూన్ 6: ఓ నిండు గర్భిణీపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ క్రూరమైన సంఘటన చోటు చేసుకున్నట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి.

ట్రెండింగ్ వార్తలు

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

ఆయుధాలు ధరించి ఉన్న ఐదుగురు వ్యక్తులు జీలం నగరంలోని ఓ ఇంట్లోకి చొరబడి.. డెలివరీ దగ్గరపడిన ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని డైలీ పాకిస్తాన్ నివేదించింది.

ముందుగా ఈ దుండగులు దాడి చేసి, భర్తను తాడుతో కట్టేసి గర్భిణీపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తరువాత పంజాబ్ పోలీసులు ఈ గ్యాంగ్‌ను వెతికిపట్టుకునే పనిలో పడ్డారు.

గర్భిణికి వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, బాధితురాలి రక్తనమూనాలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు కూడా పంపించామని పోలీసులు తెలిపారు.

కరాచీలో కదులుతున్న రైలులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ ఘాతుకం చోటుచేసుకోవడం గమనార్హం.

కదులుతున్న రైలులో 25 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన.. పాకిస్తాన్‌లో మహిళలపై నేరాలు జరుగుతున్న తీరును కళ్లకు కట్టింది.

టికెట్ చెక్ చేసే ఉద్యోగి సహా ముగ్గురు వ్యక్తులు ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరు పిల్లలు కలిగిన ఆ తల్లి కరాచీ నుంచి ముల్తాన్ ప్రయాణిస్తుండగా ఈ ఘాతుకం జరిగినట్టు పాకిస్తాన్ రైల్వే మంత్రిత్వ శాఖ నివేదికను ఉటంకిస్తూ సీఎన్ఎన్ వెల్లడించింది.

ఆ మహిళను ఏసీ కోచ్‌కు వెళ్లాలని చెప్పిన తరువాత ఈ ఘటన చోటు చేసుకున్నట్టు నివేదించింది. ఆ ముగ్గురూ అరెస్టయ్యారని సదరు నివేదికను ఉటంకిస్తూ సీఎన్ఎన్ తెలిపింది.

ఆరు నెలల్లో పంజాబ్ ప్రావిన్స్‌లో ‘కుటుంబ పరువు’ నెపంతో 90 మందిని చంపేశారని, 2,439 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయని.. పంజాబ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఇచ్చిన ఫిబ్రవరికి సంబంధించిన డేటా చెబుతోంది.

గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021 ప్రకారం పాకిస్తాన్ 156 దేశాల జాబితాలో 153 వ స్థానంలో ఉంది. అంటే చివరి నుంచి నాలుగో స్థానంలో ఉంది.

పాకిస్తాన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం గడిచిన ఆరేళ్లలో, 2015 నుంచి 2021 మధ్య రోజుకు కనీసం 11 అత్యాచారాలు జరిగాయి.

పైగా బాధితులను నిందించడం ద్వారా సమాజం నిందితులకు అనవసర ప్రయోజనం కల్పిస్తోందని నివేదిక మండిపడింది. కేసుల సంఖ్య తగ్గడానికి బదులుగా భారీగా పెరుగుతూ వస్తోందని, శిక్ష పడుతున్న కేసుల సంఖ్య 1 శాతం కంటే తక్కువగా ఉందని కమిషన్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

‘మొత్తం 22 వేల కేసుల్లో కేవలం 77 మంది నిందితులకు మాత్రమే శిక్షపడింది. శిక్ష పడిన వారి శాతం కేవలం 0.3 శాతంగా ఉంది..’ అని నివేదిక స్పష్టంచేసింది.

టాపిక్

తదుపరి వ్యాసం