తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Himachal, Gujarat Elections: ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్ పై నిషేధం

Himachal, Gujarat elections: ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్ పై నిషేధం

HT Telugu Desk HT Telugu

12 November 2022, 15:09 IST

  • Himachal, Gujarat elections: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్ పై నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

ప్రతీకాత్మక చిత్రం

Himachal, Gujarat elections: హిమాచల్ ప్రదేశ్ లో శనివారం పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 68 నియోజకవర్గాలకు శనివారం ఓటింగ్ జరుగుతోంది. గుజరాత్ లో డిసెంబర్ 1, డిసెంబర్ 5 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్ ప్రచురణ, ప్రసారం పై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

Himachal, Gujarat elections: ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్

హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఎగ్జిట్ పోల్స్ ను ప్రచురించడం కానీ, ప్రసారం చేయడం కానీ చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. నవంబర్ 12 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

Himachal, Gujarat elections: అన్నింటిపై నిషేధం

ఎన్నికలకు సంబంధించిన ఏ విషయాన్నైనా డిస్ ప్లే చేయడం, ఒపీనియన్ పోల్ లేదా ఏ ఇతర పోల్ సర్వే ఫలితాలనైనా ప్రచురించడం, ప్రసారం చేయడాన్ని పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి నిషేధించినట్లు ఎన్నికల సంఘం వివరించింది. ఈ నిషేధాన్ని ఎన్నికలు జరుగుతున్న హిమాచల్, గుజరాత్ ల్లో గెజెట్ లో ప్రచురించడంతో పాటు, కఠినంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సమాచారాన్ని అన్ని మీడియా సంస్థలకు అందించాలని కోరింది.

Himachal, Gujarat elections: బీజేపీ, కాంగ్రెస్, ఆప్ ల మధ్యనే..

హిమాచల్ ప్రదేశ్ లో ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్య నెలకొన్నది. ఆప్ కూడా ఇక్కడ అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు, గుజరాత్ లో ప్రధాన పోటీ బీజేపీ, ఆప్ ల మధ్యనే ఉంది.

తదుపరి వ్యాసం