తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Parents Left Baby: టికెట్ లేదని ఆపిన సిబ్బంది.. శిశువును ఎయిర్‌పోర్టులోనే వదిలేసిన తల్లిదండ్రులు

Parents left Baby: టికెట్ లేదని ఆపిన సిబ్బంది.. శిశువును ఎయిర్‌పోర్టులోనే వదిలేసిన తల్లిదండ్రులు

02 February 2023, 11:42 IST

    • Parents left baby at Airport: తమ శిశువును ఓ యువ జంట ఎయిర్‌పోర్టులోనే వదిలివెళ్లింది. బేబీకి టికెట్ లేదని సిబ్బంది ఆపటంతో ఇలా చేశారు. ఆ తర్వాత ఏమైందంటే..
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT Photo)

ప్రతీకాత్మక చిత్రం

Parents left baby at Airport: సాధారణంగా శిశువులను తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రయాణాల సమయంలో అయితే ఇంకా అప్రమత్తంగా ఉంటారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఓ తల్లిదండ్రులు మాత్రం ఇందుకు పూర్తి విభిన్నంగా ప్రవర్తించారు. శిశువుకు టికెట్ లేదని ఆపినందుకు.. ఏకంగా ఆ బిడ్డను ఎయిర్‌పోర్టు చెక్‍ఇన్ వద్దే వదిలివెళ్లిపోయారు. ఇజ్రాయెల్‍లో ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే..

ట్రెండింగ్ వార్తలు

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Southest Monsoon : గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

ఇదీ జరిగింది

Parents left baby at Airport: ఇజ్రాయెల్‍లోని టెల్ అవివ్ (Tel Aviv) నుంచి బ్రుసెల్స్ కు వెళ్లేందుకు ఓ యువ దంపతులు ఓ శిశువుతో పాటు విమాశ్రయానికి వచ్చారు. అయితే వారు ఆ బేబీకి టికెట్ కొనలేదు. ర్యాన్‍ఎయిర్ విమాన సంస్థ నిబంధనల ప్రకారం శిశువుకు టికెట్ కొనాల్సిందే. అయితే ఆ పేరెంట్స్ తమ బిడ్డకు టికెట్ తీసుకోలేదు. దీంతో విమాన సిబ్బంది వారిని ఆపారు. ఆ శిశువుకు కూడా టికెట్ ఉండాల్సిందేనని చెప్పేశారు. దీంతో స్టోలర్‌లో ఉన్న శిశువును విమానాశ్రంలోని చెక్ఇన్ దగ్గరే వదిలేసి వెళ్లిపోయారు ఆ తల్లిదండ్రులు. విమానం ఎక్కేందుకు ప్రయత్నించారు.

పోలీసులకు అప్పగింత

Parents left baby at Airport: అయితే, శిశువును వదిలి వెళ్లినట్టు గుర్తించిన అక్కడి సిబ్బంది విమానం ఎక్కకుండా ఆ జంటను అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. శిశువును ఎయిర్ పోర్టులో వదలివెళ్లేందుకు ప్రయత్నించటంతో ఆ జంటను కస్టడీలోకి తీసుసుకున్నారు అక్కడి పోలీసులు. జరూసలేమ్ పోస్ట్ ఈ కథనాన్ని వెల్లడించింది. ఇలా శిశువును వదిలివెళ్లేందుకు ప్రయత్నించిన ఆ పేరెంట్స్ బెల్జియమ్ పాస్‍పోర్టుతో వచ్చారని పేర్కొంది.

చిన్నపిల్లలకు టికెట్ మినహాయింపు అనేది ఆయా ఎయిర్‌లైన్స్‌ నిబంధన మేరకు ఉంటుంది. ఇండియాలో అయితే రెండు సంవత్సరాల లోపు పిల్లలకు విమానాల్లో టికెట్‍కు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. రెండో బర్త్‌డే పూర్తి కాని పిల్లలను శిశువులు (Infant)గా గుర్తిస్తామని, వారికి ఇన్‍ఫాంట్ టికెట్ తీసుకోవాలని ఎయిర్ ఇండియా (Air India) మార్గదర్శకాల్లో ఉంది. పెద్దల టికెట్ బేస్ చార్జీలో 10 శాతానికి సమానమైన చార్జీ శిశువుల టికెట్ కోసం చెల్లించాల్సి ఉంటుంది. శిశువులకు ప్రత్యేకంగా సీటు కేటాయించరు.

తదుపరి వ్యాసం