తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Pg 2024: నీట్ పీజీ పరీక్ష తేదీ మారింది. జులై లో పరీక్ష; పూర్తి వివరాలు..

NEET PG 2024: నీట్ పీజీ పరీక్ష తేదీ మారింది. జులై లో పరీక్ష; పూర్తి వివరాలు..

HT Telugu Desk HT Telugu

09 January 2024, 15:55 IST

  • NEET PG 2024: 2024 నీట్ పీజీ పరీక్ష తేదీని మార్చారు. మొదట మార్చి నెల 3వ తేదీన ఈ పరీక్షను నిర్వహించానుకున్నారు. కానీ తాజాగా, ఈ తేదీని మారుస్తూ, 2024, జులై 7వ తేదీన నీట్ పీజీ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET PG 2024: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG 2024) 2024 పరీక్ష జూలై 7న జరుగుతుందని, ఆగస్టు 15 లేదా అంతకంటే ముందు తప్పనిసరి ఇంటర్న్ షిప్ ను పూర్తి చేసిన ఎంబీబీఎస్ వైద్యులు దీన్ని రాయవచ్చని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) మంగళవారం ప్రకటించింది.

మార్చి 3 నుంచి..

నీట్ పీజీ 2024 (NEET PG 2024) పరీక్షను 2024 మార్చి 3న నిర్వహిస్తామని నవంబర్ 9 న ఇచ్చిన నోటిఫికేషన్ ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ వెనక్కు తీసుకుంది. ఆ పరీక్షను జూలై 7, 2024న నిర్వహించాలని తాజాగా నిర్ణయించారు. అయితే, జులై 7 కూడా ప్రొవిజనల్ తేదీనే. కచ్చితమైన పరీక్ష తేదీలను NBEMS అధికారిక వెబ్ సైట్లో త్వరలో ప్రకటిస్తారు. అలాగే, పరీక్షకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు, ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఇతర వివరాలను natboard.edu.in లో పొందుపరుస్తారు.

ఈ కోర్సుల్లో ప్రవేశం కోసం..

నీట్-పీజీ భారత దేశంలో ఎండీ/ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష. ఇటీవల నోటిఫై చేసిన "పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్, 2023" ప్రకారం ఈ సంవత్సరం నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ((NExT)) ఉండదు. పీజీ అడ్మిషన్ కోసం ప్రతిపాదిత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ((NExT)) అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న నీట్-పీజీ పరీక్ష కొనసాగుతుంది.

నేషనల్ ఎగ్జిట్ టెస్ట్

ప్రతిపాదిత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (NExT) పరీక్ష నీట్ పీజీ (NEET PG), ఎఫ్ఎంజీఈ (FMGE) పరీక్షల స్థానంలో దేశంలో ఆధునిక వైద్యాన్ని ప్రాక్టీస్ చేయడానికి, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో మెరిట్ ఆధారిత ప్రవేశం కోసం, భారతదేశంలో ప్రాక్టీస్ చేయాలనుకునే విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లకు స్క్రీనింగ్ పరీక్షగా పనిచేస్తుంది.

తదుపరి వ్యాసం