తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mukesh Ambani Love Story : ‘రోడ్డు మధ్యలో నీతాకు ప్రపోజ్​ చేశా’- ముకేశ్​ అంబానీ!

Mukesh Ambani love story : ‘రోడ్డు మధ్యలో నీతాకు ప్రపోజ్​ చేశా’- ముకేశ్​ అంబానీ!

Sharath Chitturi HT Telugu

15 March 2024, 13:38 IST

  • Mukesh Ambani Nita Ambani love story : ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నప్పుడు నీతా అంబానీకి తాను ఎలా ప్రపోజ్ చేశానో ముఖేష్ అంబానీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ముకేశ్​ అంబానీ, నీతా అంబానీ దంపతులు..
ముకేశ్​ అంబానీ, నీతా అంబానీ దంపతులు.. (ANI)

ముకేశ్​ అంబానీ, నీతా అంబానీ దంపతులు..

Mukesh Ambani Nita Ambani : ముకేశ్​ అంబానీ- నీతా అంబానీలు మేడ్​ ఫర్​ ఈచ్​ అధర్​లా ఉంటారు! ముకేశ్​కు నీతా అన్ని విధాలుగా సాయం చేస్తూ ఉంటారు. రిలయన్స్​కి చెందిన చాలా విషయాలను ఆమె దగ్గరుండి చూసుకుంటారు. మరి.. నీతా అంబానీకి ముకేశ్​ అంబానీ ఎలా ప్రపోజ్​ చేశారో మీకు తెలుసా?

'రోడ్డు మధ్యలో ప్రపోజ్​ చేశా..'

గతంలో.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ముకేశ్​ అంబానీ దంపతులు. నీతా అంబానీకి ప్రొపోజ్​ చేసిన రోజును ఆయన గుర్తు చేసుకున్నారు. రోడ్డు మధ్యలో, భారీ ట్రాఫిక్​ జామ్​లో నీతాకు ప్రపోజ్​ చేసినట్టు చెప్పారు.

"నిజంగా నేను చూసిన మొదటి అమ్మాయి.. నీతా. ఆమె నా జీవిత భాగస్వామి అని నేను నిర్ణయించుకున్నాను. ఒకసారి మేము పెద్దార్ రోడ్డులో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు.. సడెన్​గా, 'నీతా, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడే సమాధానం చెప్పు. యెస్​ ఆఆ? నో ఆఆ?" అని అడినట్టు.. ముకేశ్​ అంబానీ చెప్పారు.

అప్పుడు నీతా అంబానీ.. “డ్రైవ్​ చెయ్యి. వెనకాల హార్న్​ కొడుతున్నారు,” అని అన్నారట. 'యెస్​? ఆర్​ నో? సమాధానం చెబితేనే.. కారు కదులుతుంది," అని ముకేశ్​ అన్నారు.

నీతా అంబానీని ముకేశ్​ అంబానీ.. మూడుసార్లు అడగాల్సి వచ్చింది. ఆ తర్వాతే, ఆమె ఒప్పుకున్నారు.

Mukesh Ambani Nita Ambani love story : అయితే.. ‘నేను నీ ప్రపోజల్​ని తిరస్కరించి ఉంటే? ఏం చేసేవాడివి? అక్కడే వదిలేసే వాడివా?’ అని ముకేశ్​ అంబానీని అడిగారు నీతా. “లేదు. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్​ చేసి వెళ్లిపోయేవాడిని. మనం స్నేహితులుగా ఉండేవాళ్లం,” అని బదులిచ్చారు ముకేశ్​ అంబానీ.

ముకేశ్​ అంబానీని వివాహం చేసుకున్న ఏడాదిలోనే సన్ ఫ్లవర్ నర్సరీలో టీచింగ్ ప్రారంభించానని నీతా అంబానీ ఆ చాట్​లో వెల్లడించారు. ఆ సమయంలో ప్రజలు తనను చూసి నవ్వేవారని, కానీ అది తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని నీతా అంబానీ చెప్పుకొచ్చారు.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియో ఇక్కడ చూడండి:

తదుపరి వ్యాసం