Anant Ambani speech : అనంత్ స్పీచ్.. ఎమోషన్‌తో ఏడ్చేసిన ముకేశ్ అంబానీ!
Anant Ambani's pre wedding : పెళ్లి వేడుకల్లో భాగంగా ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ఆయన మాటలకు.. తండ్రి ముకేశ్ అంబానీ కంటతడి పెట్టుకున్నారు.
Anant Ambani wedding speech : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం.. జామ్‌నగర్‌లో జరుగుతున్న ఈ 3 రోజుల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో భాగంగా.. చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు అనంత్ అంబానీ. తన తల్లిదండ్రులతో పాటు కాబోయే భార్య రాధిక మర్చెంట్‌కు థాంక్యూ చెప్పారు. అనంత్ ఇచ్చిన స్పీచ్‌కు.. ఎమోషనల్ అయిన ముకేశ్ అంబానీ.. కంటతడి పెట్టుకున్నారు.
అనంత్ అంబానీ ఎమోషనల్ స్పీచ్..
తన జీవితంలో కీలక పాత్ర తన తల్లిదండ్రులదే అని అన్నారు అనంత్ అంబానీ.
"అమ్మా! థాంక్యూ. ఈ ఈవెంట్ ఇంత గొప్పగా జరగడానికి కారణం నువ్వే. గత నాలుగు నెలలుగా మా అమ్మ 18-19 గంటలు పనిచేస్తూ, ఈవెంట్‌కి ఏర్పాట్లు చేసింది. థాంక్యూ. ఇక్కడికి వచ్చిన వారందరికి ధన్యవాదాలు. నేను, రాధికా చాలా సంతోషంగా ఉన్నాము. ఎవరికైనా అసౌకర్యం కలిగించి ఉంటే క్షమించండి. నా తల్లి, తండ్రి, సోదరులు.. కుటుంబసభ్యులందరికి థాంక్యూ. మా ప్రత్యేకమైన రోజును మరింత ప్రత్యేకం చేసేందుకు చాలా మంది కష్టపడ్డారు," అని అనంత్ అంబానీ స్పీచ్‌లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి:- Ambani’s wedding: ‘‘నా చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి విషయంలో నావి రెండే ముఖ్యమైన కోరికలు’’ - నీతా అంబానీ
"మీ అందరికి తెలుసు.. నా జీవితంలో చాలా ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. చాలా ముళ్లు గుచ్చుకున్నాయి. చాలా బాధపడ్డాను. చిన్నపటి నుంచి చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాను. కానీ నా తల్లిదండ్రులు.. బాధ కలగకుండా చూసుకున్నారు. నా తల్లిదండ్రులు ఎప్పుడు నాకు మద్దతుగా నిలిచారు. నేను అనుకున్నది సాధించగలను అన్న నమ్మకాన్ని ఇచ్చారు. వారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను," అని అనంత్ అంబానీ అన్నారు.
Anant Ambani Radhika wedding : ఆ మాటలకు.. ముకేశ్ అంబానీ కన్నీరు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక.. తన స్పీచ్‌లో కాబోయే భార్య రాధికను కూడా ప్రస్తావించారు అనంత్.
"రాధిక విషయంలో నేను 100శాతం లక్కీ! ఆ విషయంలో డౌట్ లేదు. రాధిక గత 7ఏళ్లుగా నాతో ఉంది. కానీ నిన్ననే తొలిసారి కలిసినట్టు అనిపిస్తోంది. ప్రతి రోజు.. ఆమెతో ఇంకాస్త ఎక్కువ ప్రేమలో పడుతున్నాను. థాంక్యూ రాధిక," అని అనంత్ అంబానీ.
Anant Ambani Radhika Merchant engagement : ప్రస్తుతం అనంత్ అంబానీ- రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ సాగుతోంది. జులైలో ఈ ఇద్దరి పెళ్లి జరుగుతుంది.
సంబంధిత కథనం