తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  రూ. 63 వేల వరకు పెరిగిన మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాల ధరలు

రూ. 63 వేల వరకు పెరిగిన మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాల ధరలు

HT Telugu Desk HT Telugu

14 April 2022, 13:39 IST

  • దేశంలోని ప్రముఖ ఆటోమోటివ్ కంపెనీలలో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా గురువారం తన వాహనాల శ్రేణి ధరల్లో 2.5 శాతం పెంపును ప్రకటించింది. దీని ఫలితంగా వాహనాల ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 10 వేల నుంచి రూ. 63,000 వరకు పెరుగనున్నాయి.

వాహనాల ధరలు పెంచేసిన మహీంద్రా అండ్ మహీంద్రా
వాహనాల ధరలు పెంచేసిన మహీంద్రా అండ్ మహీంద్రా (REUTERS)

వాహనాల ధరలు పెంచేసిన మహీంద్రా అండ్ మహీంద్రా

ht‘స్టీలు, అల్యూమినియం, పల్లాడియం మొదలైన కీలక వస్తువుల ధరలు నిరంతరం పెరగడం వల్ల ధరల సవరణ చేశాం..’ అని మహీంద్రా అండ్ మహీంద్రా ఒక ప్రకటనలో తెలిపింది. ధరల పెంపు ఏప్రిల్ 14, 2022 నుండి అమలులోకి వచ్చింది. 

అన్ని మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాలపై వాహన పెంపు వర్తిస్తుందని, గురువారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. మోడల్, వేరియంట్ ఆధారంగా వాహనాల శ్రేణిలో ఎక్స్-షోరూమ్ ధరలపై ధర రూ. 10,000 నుండి రూ.63,000 వరకు పెరిగినట్టు తెలిపింది.

‘కమోడిటీ ధరలలో ఇంతకుముందెన్నడూ లేని పెంపుదలను భరించడానికి తగినరీతిలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది..’ అని కంపెనీ తెలిపింది.

మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ధరలను తమ కస్టమర్లకు తెలియజేయడానికి వీలుగా చర్యలు తీసుకున్నట్టు తెలిపింద

టాపిక్

తదుపరి వ్యాసం