తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘Like They Plundered India…’: ‘భారత్ ను దోచుకున్నట్లుగా..’

‘Like they plundered India…’: ‘భారత్ ను దోచుకున్నట్లుగా..’

HT Telugu Desk HT Telugu

30 September 2022, 21:19 IST

    • ‘Like they plundered India…’: రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి పశ్చిమ దేశాలపై మండిపడ్డారు. గతంలో భారతదేశాన్ని ఆక్రమించి దోచుకున్నట్లుగా.. రష్యాను కూడా దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. 
రష్యా అధ్యక్షుడు పుతిన్
రష్యా అధ్యక్షుడు పుతిన్ (via REUTERS)

రష్యా అధ్యక్షుడు పుతిన్

‘Like they plundered India…’: గతంలో భారత్ ను చేసినట్లుగానే ఇప్పుడు రష్యాను ఒక వలస దేశంగా మార్చాలని పశ్చిమ దేశాలు కుట్ర చేస్తున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు.

‘Like they plundered India…’: ఆ కుట్రను సాగనివ్వం

రష్యా ను ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ దేశాలకు కాలనీగా మారనివ్వనని పుతిన్ స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల చరిత్ర అంతా భారత్ వంటి దేశాలను ఆక్రమించుకుని, వాటిని వలస దేశాలుగా మార్చి, దోచుకోవడమేనని ఆరోపించారు. పశ్చిమ దేశాల కుట్రపై అంతా అప్రమత్తంగా ఉండాలని, ఇప్పుడు రష్యా, ఇరాన్ లు వాటికి లక్ష్యాలుగా మారినట్లే భవిష్యత్తులో వేరే దేశాలు మారుతాయని హెచ్చరించారు.

‘Like they plundered India…’: డ్రగ్స్ కు బానిసలను చేస్తారు

‘వాళ్లు ఇండియాను, చైనాను, ఆఫ్రికాను దోచుకున్నారు. ప్రజలను డ్రగ్స్ కు బానిసలుగా మార్చారు. మనుషులను పశువుల్లా వేటాడారు. మేం దాన్ని అడ్డుకున్నాం’ అని పుతిన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒపియం వార్, భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామాలను పుతిన్ గుర్తు చేశారు. దేశ ప్రజలను ఉద్దేశించి దాదాపు 37 నిమిషాల పాటు పుతిన్ ప్రసంగించారు. రష్యాను తమ కాలనీ గా మార్చుకోవాలన్న అమెరికా, పశ్చిమ దేశాల కుట్రను సాగనివ్వబోమని పుతిన్ తేల్చి చెప్పారు.

‘Like they plundered India…’: అవి మావే..

ఉక్రెయిన్ యుద్ధంలో ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాలు రష్యాలో అంతర్భాగంగానే కొనసాగుతాయని పుతిన్ స్పష్టం చేశారు. డొనెస్క్, లుహాన్క్స్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాల ప్రజలు రష్యాతోనే ఉండాలనుకుంటున్నారన్నారు. రష్యాలో ఆ ప్రాంతాలు విలీనమయ్యే ఒప్పందాలపై శుక్రవారం పుతిన్ తదితరులు సంతకాలు చేశారు. అయితే, ఈ విలీనాన్ని ఐక్యరాజ్య సమితి, ఇతర పశ్చిమ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

తదుపరి వ్యాసం