తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Keshav Maharaj: ఇండియా, సౌతాఫ్రికా సిరీస్‌లో రామ్ సీతా రామ్ సాంగ్.. ఆ సౌతాఫ్రికా బౌలర్ అడిగినందుకే..

Keshav Maharaj: ఇండియా, సౌతాఫ్రికా సిరీస్‌లో రామ్ సీతా రామ్ సాంగ్.. ఆ సౌతాఫ్రికా బౌలర్ అడిగినందుకే..

Hari Prasad S HT Telugu

09 January 2024, 15:05 IST

    • Keshav Maharaj: ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో కేశవ్ మహరాజ్ బ్యాటింగ్ కు దిగినప్పుడు రామ్ సియా రామ్ పాట వినిపించి ఆశ్చర్య పరిచింది. అయితే ఆ పాట ప్లే చేయాలని తానే అడిగినట్లు అతడు చెప్పాడు.
రామ్ సియా రామ్ పాట ప్లే అవుతుంటే భక్తితో చేతులు జోడించిన విరాట్ కోహ్లి
రామ్ సియా రామ్ పాట ప్లే అవుతుంటే భక్తితో చేతులు జోడించిన విరాట్ కోహ్లి

రామ్ సియా రామ్ పాట ప్లే అవుతుంటే భక్తితో చేతులు జోడించిన విరాట్ కోహ్లి

Keshav Maharaj: ఇండియా, సౌతాఫ్రికా రెండో టెస్టు సందర్భంగా స్టేడియంలో ఆదిపురుష్ మూవీలోని రామ్ సియా రామ్ పాటను ప్లే చేయాల్సిందిగా తానే కోరినట్లు సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ వెల్లడించాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో కేశవ్ బ్యాటింగ్ కు వస్తుండగా ఈ పాట వినిపించింది.

ట్రెండింగ్ వార్తలు

IPL 2024: ఒక్క మ్యాచ్ ఆడ‌కుండా కోట్లు సంపాదించారు - ఈ ఐపీఎల్‌లో బెంచ్‌కే ప‌రిమిత‌మైన స్టార్ క్రికెట‌ర్లు వీళ్లే

India vs Pakistan: టీ20 ప్రపంచకప్‍లో ఇండియా, పాకిస్థాన్ సమరం జరిగే స్టేడియం ప్రారంభం.. లాంచ్ చేసిన పరుగుల వీరుడు

Sunrisers Hyderabad: రాజస్థాన్ వరుస పరాజయాలు.. సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఆ గోల్డెన్ ఛాన్స్

Pbks vs RR: ప్లేఆఫ్స్ ముంగిట రాజ‌స్థాన్ త‌డ‌బాటు - వ‌రుస‌గా నాలుగో ఓట‌మి - పంజాబ్ చేతిలో చిత్తుగా ఓడిన సంజూ సేన‌

ఇది విని చాలా మంది ఆశ్చర్యపోయారు. సౌతాఫ్రికాలో జరుగుతున్న ఈ టెస్టులో మన రాముడి పాట వినిపించడం ఏంటని అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పాట విని ఇండియన్ టీమ్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి కూడా భక్తి భావంలో మునిగిపోయాడు. అయితే ఆ పాటను తాను చెబితేనే ప్లే చేసినట్లు తాజాగా కేశవ్ మహరాజ్ వెల్లడించాడు.

నేనే రిక్వెస్ట్ చేశాను: కేశవ్ మహరాజ్

భారత మూలాలు ఉన్న కేశవ్ మహరాజ్ సౌతాఫ్రికా టీమ్ తరఫున కొన్నేళ్లుగా ఆడుతున్నాడు. ఆ దేశంలో పుట్టి పెరిగినా.. తన ధర్మాన్ని మాత్రం అతడు మరచిపోలేదు. తనకు భక్తి భావం ఎక్కువని, దేవుడంటే అపార నమ్మకం అని ఈ సందర్భంగా అతడు స్పష్టం చేశాడు. అది కూడా తాను బ్యాటింగ్ కు దిగుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ లో రామ్ సియా రామ్ పాట వినిపించడం చాలా బాగా అనిపించిందని అన్నాడు.

"నేనే అక్కడి మీడియా లేడీని ఆ పాట ప్లే చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశాను. నా వరకూ దేవుడే అన్నీ. నాకు మార్గనిర్దేశనం చేసి అవకాశం కల్పించేది ఆ దేవుడే. ఇది నేను ఆ దేవుడికి నా వంతుగా చేసే ఓ చిన్న విషయం. అంతేకాదు అలా దేవుడి పాట వింటుంటే మనల్ని మనం మైమరచిపోతాం. బ్యాక్‌గ్రౌండ్ లో రామ్ సియా రామ్ ప్లే అవుతుంటే.. గ్రౌండ్లోకి బ్యాటింగ్ చేయడానికి వెళ్తుండటం చాలా బాగా అనిపించింది" అని కేశవ్ మహరాజ్ పీటీఐతో చెప్పాడు.

ఇండియాతో జరిగిన ఈ రెండో టెస్టులో సౌతాఫ్రికా 7 వికెట్లతో తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను ఇండియా 1-1తో సమం చేసింది. అంతేకాదు సౌతాఫ్రికా టూర్లో వన్డే సిరీస్ గెలిచిన ఇండియన్ టీమ్.. టీ20 సిరీస్ ను కూడా డ్రా చేసింది. దీంతో ఒక్క సిరీస్ ఓడకుండా సౌతాఫ్రికా టూర్ ను ఘనంగా ముగించింది. రెండో టెస్టులో పేస్ బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ పై సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడంతో ఇండియా చారిత్రక విజయం సాధించింది.

ఇక కేశవ్ మహరాజ్ విషయానికి వస్తే సౌతాఫ్రికా తరఫున 50 టెస్టులు ఆడిన అతడు.. 158 వికెట్లు తీశాడు. కెరీర్లో 9సార్లు ఇన్నింగ్స్ లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఇక వన్డేల్లో 55, టీ20ల్లో 24 వికెట్లు తీసుకున్నాడు. గతేడాది ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ లోనూ 10 మ్యాచ్ లలో 15 వికెట్లు తీసి రాణించాడు. సౌతాఫ్రికా టీమ్ సెమీస్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు.

తదుపరి వ్యాసం